Cough: ఇదేం విచిత్రం.. అతడు దగ్గితే ఒంట్లో ఎముకలు ‘ఫట్‌ఫట్‌’ అంటూ ఇరిగిపోవాల్సిందే..!

వాతావరణం కొంచెం మార్పు చెందితే జలుబు, దగ్గు సర్వసాధారణం. కానీ ఎవరైనా దగ్గితే మహా అయితే తుంపరలు ఎదుటి వారి మీద పడతాయ్‌. ఇంకాస్త ఎక్కువగా దగ్గితే కంట్లో నీళ్లొస్తాయి. కానీ ఇతగాడెవడో గానీ.. దగ్గడంతో ఒంట్లో ఎముకలు కూడా పటపటా విరిగిపోయాయి. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజంగానే జరిగింది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడి సెకండ్ పీపుల్స్ హాస్పిటల్ వైద్యులు..

Cough: ఇదేం విచిత్రం.. అతడు దగ్గితే ఒంట్లో ఎముకలు 'ఫట్‌ఫట్‌' అంటూ ఇరిగిపోవాల్సిందే..!
Man Breaks Hardest Bone In Body
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 02, 2024 | 7:40 PM

వాతావరణం కొంచెం మార్పు చెందితే జలుబు, దగ్గు సర్వసాధారణం. కానీ ఎవరైనా దగ్గితే మహా అయితే తుంపరలు ఎదుటి వారి మీద పడతాయ్‌. ఇంకాస్త ఎక్కువగా దగ్గితే కంట్లో నీళ్లొస్తాయి. కానీ ఇతగాడెవడో గానీ.. దగ్గడంతో ఒంట్లో ఎముకలు కూడా పటపటా విరిగిపోయాయి. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజంగానే జరిగింది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడి సెకండ్ పీపుల్స్ హాస్పిటల్ వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల అక్కడికి వైద్యం కోసం వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన షాకింగ్ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు మీడియాతో పంచుకున్నారు. కేవలం దగ్గు వల్ల ఆ వ్యక్తి శరీరంలో ఓ ఎముక విరిగిందని తెలిపారు. అదీ శరీరంలో అత్యంత బలమైన ఎముక విరిగిందట.

సాధారణంగా 35 ఏళ్లలోపు వ్యక్తులు ఏదైనా కారు ప్రమాదం లేదా ఎత్తు నుంచి పడిపోవడం వంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే కాలి తొడ ఎముకలు విరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో తప్ప విడిగా మానవ శరీరంలోని ఈ ఎముక విరగడం దాదాపు అసాధ్యం అంటున్నాడు హాస్పిటల్‌లోని ఆర్థోపెడిక్స్ విభాగం డైరెక్టర్ డాంగ్ జాంగ్. అలాంటిది కేవలం దగ్గు వల్ల తొడ ఎముక విరగడం షాకింగ్‌కు గురిచేసిందని తెలిపాడు.

దగ్గుతున్నప్పుడు ఆ ఎముక ఎలా విరిగిందంటే..

ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. బాధితుడు తనకు దగ్గు వచ్చిన వెంటనే, కాలి భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చినట్లు గుర్తించాడు. అయితే అతను దానిని తిమ్మిరిగా భావించి పట్టించుకోలేదట. నొప్పి కారణంగా అతడికి నడవడం కష్టంగా అనిపించడంతో, ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి వైద్యులు ఎక్స్-రే చేసి, అతని తొడ ఎముక విరిగినట్లు గుర్తించారు. నిజానికి.. ఎక్స్‌ రే చూసిన వైద్యులు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అతని శరీరంపై ఎక్కడా గాయం గుర్తులు లేవు. ఇదెలా జరిగిందనీ అతడిని అడగ్గా అసలు విషయం తెలిపాడు. దగ్గడం వల్ల తొడ ఎముక విరిగిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

దీంతో సదరు వ్యక్తిని ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి గురించి అడిగి వైద్యులు అదిగి తెలుసుకున్నారు. అనంతరం అతడికి ‘బోన్ డెన్సిటీ టెస్ట్’ నిర్వహించగా.. అతని ఎముకల సాంద్రత 80 ఏళ్ల వృద్ధుడిలా ఉన్నట్లు తేలింది. కానీ అతనికి ఎముకల వ్యాధి లేదని వైద్యులు నిర్ధారించారు. అతనికి కోక్ తాగే అలవాటు ఉందట. సరైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వల్ల అతని ఎముకలు చాలా బలహీనంగా మారాయని, అందువల్లనే ఎముకలు పెలుసుగా మారీ సులువుగా ఇరిగిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.