Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election 2024 Results: కేరళలో బీజేపీ చారిత్రక విజయం.. ఎంపీగా గెలుపొందిన నటుడు సురేష్‌ గోపి

ప్రముఖ మలయాళ నటుడు, బీజేపీ నేత సురేష్‌ ప్రభు లోక్‌సభ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ స్థానం నుంచి పోటీ చేసిన సురేష్‌ దాదపు 75,079 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. త్రిస్సూర్ స్థానం నుంచి ఆయనకు మొత్తం 4,09,239 ఓట్లతో తొలి స్థానంలో నిలవగా.. ప్రత్యర్ధి ఎల్‌డిఎఫ్‌కు పార్టీకి చెందిన విఎస్ సునీల్ కుమార్ 3,34,160 ఓట్లతో రెండో స్థానంలో వెనుకంజలో..

Lok Sabha Election 2024 Results: కేరళలో బీజేపీ చారిత్రక విజయం.. ఎంపీగా గెలుపొందిన నటుడు సురేష్‌ గోపి
Malayalam Actor Suresh Gopi
Srilakshmi C
|

Updated on: Jun 04, 2024 | 6:03 PM

Share

త్రిస్సూర్, జూన్ 4: ప్రముఖ మలయాళ నటుడు, బీజేపీ నేత సురేష్‌ ప్రభు లోక్‌సభ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ స్థానం నుంచి పోటీ చేసిన సురేష్‌ దాదపు 75,079 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. త్రిస్సూర్ స్థానం నుంచి ఆయనకు మొత్తం 4,09,239 ఓట్లతో తొలి స్థానంలో నిలవగా.. ప్రత్యర్ధి ఎల్‌డిఎఫ్‌కు పార్టీకి చెందిన విఎస్ సునీల్ కుమార్ 3,34,160 ఓట్లతో రెండో స్థానంలో వెనుకంజలో ఉన్నారు. దీంతో కేరళలో బీజేపీకి తొలి విజయాన్ని సూచించడమే కాకుండా రాష్ట్రం నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా సురేష్ గోపీ రికార్డు సృష్టించారు.

త్రిస్సూర్ నియోజక వర్గం నుంచి 1989లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొదటిసారిగా పోటి చేసి కేవలం 5.35% ఓట్లతో ఓటమిపాలైంది. ఇదే ట్రెండ్ తదుపరి ఏడు ఎన్నికలలో అంటూ 2014 వరకు కొనసాగింది. అక్కడ బీజేపీ ఓట్ షేర్ కేవలం 10% మాత్రమే నమోదైంది. అయితే 2019లో ఒక్కసారికగా అక్కడి ఓటు బ్యాంకును సురేష్ గోపీ తలకిందులు చేశారు. ఆయన రాజకీయాల్లో ప్రవేశించడంతో స్థానిక ఎన్నికల డైనమిక్స్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

కేరళలోని త్రిసూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించడంపై మలయాళ నటుడు సురేశ్ గోపి మీడియాతో మాట్లాడుతూ ‘నేను పూర్తిగా ఎక్సటిక్ మూడ్‌లో ఉన్నాను. చాలా అసాధ్యమైనది అద్భుతం సాధ్యమైంది. ఇది 62 రోజుల ప్రచార ఫలితం కాదు. గత ఏడేళ్లనాటి ఎమోషనల్ క్యారేజ్‌’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.