TG DOST 2024 Phase 1 Results: తెలంగాణ దోస్త్ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి.. ఇవాళ్టి నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) మొదటి విడత సీట్లను గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేటాయించారు. దోస్ట్‌ ఫేజ్‌-1లో మొత్తం 76,290 మంది విద్యార్థుల‌కు సీట్లు కేటాయించారు. ఆర్ట్స్ గ్రూపుల్లో 7,766 మందికి..

TG DOST 2024 Phase 1 Results: తెలంగాణ దోస్త్ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి.. ఇవాళ్టి నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్లు
TG DOST 2024 Phase 1 Results
Follow us

|

Updated on: Jun 06, 2024 | 5:56 PM

హైదరాబాద్‌, జూన్‌ 6: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) మొదటి విడత సీట్లను గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేటాయించారు. దోస్ట్‌ ఫేజ్‌-1లో మొత్తం 76,290 మంది విద్యార్థుల‌కు సీట్లు కేటాయించారు. ఆర్ట్స్ గ్రూపుల్లో 7,766 మందికి, కామ‌ర్స్ గ్రూపుల్లో 28,655 మందికి, లైఫ్ సైన్సెస్ గ్రూపుల్లో 15,301 మందికి, ఫిజిక‌ల్ సైన్సెస్ గ్రూపుల్లో 14,964 మందికి, డేటా సైన్స్ గ్రూపుల్లో 2502 మందికి, డీ ఫార్మసీ గ్రూపులో 90, ఇత‌ర గ్రూపుల్లో 7012 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. కాగా ఫేజ్‌-1లో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి మొత్తం 1,04,784 మంది విద్యార్థులు రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు.

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) మొదటి విడత సీట్ల కేటాయింపు జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక రెండో విడత ప్రవేశాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 6 నుంచి 13 మధ్య జరుగుతుంది. జూన్‌ 6 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. జూన్‌ 18న దోస్త్‌ రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడో విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు జూన్‌ 19 నుంచి 25 వరకు కొనసాగుతాయి. జూన్‌ 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జులై 2న దోస్ట్‌ మూడో విడత సీట్లు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1066 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 135 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, 86 రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో వివిధ కోర్సులకు సంబంధించి 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది 3,89,049 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిల్లో 2.05లక్షల సీట్లలో విద్యార్ధులు ప్రవేశాలు పొందారు. ఇక జూలై 8వ తేదీ నుంచి డిగ్రీ ఫస్టియర్‌ క్లాసులు ప్రారంభమవుతాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు