Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన కేంద్ర మంత్రులు వీరే.. కేబినెట్‌కు దూరమైన హేమాహేమీలు!

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పరాజయం పాలవకపోయినా మోదీ మ్యాజిక్‌ ఈ సారి వర్కౌట్‌ కాలేదు. అందుకు కారణం అగ్ర నేతలుగా పేరుగాంచిన కేంద్ర మంత్రులు ఘోర పరాజయం పాలవడమే. ముఖ్యంగా మోదీ మంత్రి వర్గంలో కీలక పదవుల్లో మంత్రులుగా కొనసాగిన స్మృతి ఇరానీ, అర్జున్ ముండా, అజ‌య్ మిశ్రా తేనీలు, రాజీవ్ చంద్రశేఖర్‌లతో సహా పలువురు ప్రముఖ నేతలు..

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన కేంద్ర మంత్రులు వీరే.. కేబినెట్‌కు దూరమైన హేమాహేమీలు!
Union Ministers In Loksabha Elections
Follow us

|

Updated on: Jun 05, 2024 | 5:21 PM

న్యూఢిల్లీ, జూన్‌ 5: ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పరాజయం పాలవకపోయినా మోదీ మ్యాజిక్‌ ఈ సారి వర్కౌట్‌ కాలేదు. అందుకు కారణం అగ్ర నేతలుగా పేరుగాంచిన కేంద్ర మంత్రులు ఘోర పరాజయం పాలవడమే. ముఖ్యంగా మోదీ మంత్రి వర్గంలో కీలక పదవుల్లో మంత్రులుగా కొనసాగిన స్మృతి ఇరానీ, అర్జున్ ముండా, అజ‌య్ మిశ్రా తేనీలు, రాజీవ్ చంద్రశేఖర్‌లతో సహా పలువురు ప్రముఖ నేతలు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వడం తీవ్ర నిరాశకు గురిచేసింది.

లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కేంద్ర మంత్రులు వీరే..

  • అమేథీ నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్‌ నేత కిశోరీ లాల్ శర్మ చేతిలో 1,67,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో ఇదే స్థానం నుంచి రాహుల్ గాంధీపై విజ‌యం సాధించిన ఆమె ఈసారి అనూహ్య రీతిలో ఓడిపోయారు.
  • జార్ఖండ్‌లోని ఖుంటి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండా చేతిలో కేంద్ర గిరిజన వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా 1,49,675 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి అజ‌య్ మిశ్రా తేని ల‌కింపుర్ ఖేరి ఘ‌ట‌న వివాదంలో పీకల్లోతు ఇరుక్కుపోయారు. ఇదే ఆయన్ని స‌మాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఉత్కర్ష్ వ‌ర్మ చేతిలో ఆయ‌న 34 వేల ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యేలా చేసింది.
  • వ్యవ‌సాయ‌, రైతు సంక్షేమ‌శాఖ స‌హాయ మంత్రిగా చేసిన కైలాశ్ చౌద‌రీ రాజ‌స్తాన్‌లోని బార్మర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఉమ్మెడ రామ్ బెనివాల్ చేతిలో 4.48 ల‌క్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • కేంద్ర మంత్రి ఆర్కే సింగ్.. బీహార్‌లోని అర్రాలో సీపీఐఎంఎల్‌కు చెందిన సుదామ ప్రసాద్‌పై 59,808 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • కేర‌ళ‌లోని తిరువనంత‌పురం నుంచి పోటీ చేసిన ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీశాఖ స‌హాయ మంత్రిగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖ‌ర్ కాంగ్రెస్ దిగ్గజ నేత శ‌శిథ‌రూర్‌ చేతిలో 16వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడారు.
  • కేంద్ర భారీ ప‌రిశ్రమ‌ల మంత్రి మ‌హేంద్ర నాథ్ పాండే .. యూపీలోని చండౌలీ స్థానం నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.
  • హౌజింగ్‌, అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి కౌశ‌ల్ కిషోర్ మోహ‌న్‌లాల్‌గంజ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి స‌మాజ్‌వాదీ నేత ఆర్కే చౌద‌రి చేతిలో 70వేల ఓట్ల తేడాతో పోడిపోయారు.
  • క‌న్జ్యూమ‌ర్ అఫైర్స్‌, ఫుడ్‌, ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ శాఖ స‌హాయ మంత్రి సాధ్వీ నిరంజ‌న్ జ్యోతి యూపీలోని ఫ‌తేపుర్ నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
  • రైల్వేశాఖ స‌హాయ మంత్రి రావు సాహెబ్ దాన్వే .. మ‌హారాష్ట్రలోని జాల్నా స్థానం నుంచి పోటీ చేసి ఓట‌మి చెందారు.
  • కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్‌.. ముజాఫ‌ర్‌న‌గ‌ర్ లోక్‌స‌భ సీటు నుంచి పోటీచేసి ప్రత్యర్ధి ఎస్పీ నేత హ‌రీంద్ర సింగ్ మాలిక్‌ఫై 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • విదేశాంగ శాఖ‌, పార్లమెంట‌రీ వ్యవ‌హారాల శాఖ స‌హాయ మంత్రి వీ ముర‌ళీధ‌ర‌న్ కూడా ఓన్నికల్లో ఓడిపోయారు.
  • ఫిష‌రీస్‌, యానియ‌ల్ హ‌జ్‌బెండ‌రీ, డెయిరీ శాఖ స‌హాయ మంత్రి ఎల్ మురుగ‌న్.. డీఎంకే నేత ఏ రాజా చేతిలో 2 ల‌క్షల ఓట్ల తేడాతో ఓట‌మి పాలయ్యారు.
  • హోంశాఖ స‌హాయ మంత్రి నిషిత్ ప్రామానిక్‌.. బెంగాల్‌లోని కూచ్ బిహార్ నుంచి పోటీచేసి టీఎంసీ నేత జ‌గ‌దీశ్ చంద్ర బాసునియా చేతిలో 39వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • విద్యాశాఖ స‌హాయ మంత్రి సుభాష్ స‌ర్కార్‌.. బంకురా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి, టీఎంసీ నేత అరూప్ చ‌క్రవ‌ర్తిపై 32 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
ప్రముఖ నటి అభినయ ఇంట తీవ్ర విషాదం..రిక్షాలో వెళుతూ తల్లి కన్నుమూత
ప్రముఖ నటి అభినయ ఇంట తీవ్ర విషాదం..రిక్షాలో వెళుతూ తల్లి కన్నుమూత
కడప విద్యార్థిని సత్తా.. రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో కొలువు
కడప విద్యార్థిని సత్తా.. రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో కొలువు
బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‏గా పనిచేసిన అమ్మాయికి పాన్ ఇండియా క్రేజ్.
బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‏గా పనిచేసిన అమ్మాయికి పాన్ ఇండియా క్రేజ్.
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఈ చిన్న చిట్కాలతో గురకను శాశ్వతంగా తగ్గించుకోండి..
ఈ చిన్న చిట్కాలతో గురకను శాశ్వతంగా తగ్గించుకోండి..
సోమవారం అన్ని స్కూళ్లకు సెలవు.. రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన
సోమవారం అన్ని స్కూళ్లకు సెలవు.. రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్