Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సికింద్రాబాద్‌లో ఘోరం.. సిగ్నల్ జంప్‌ చేయబోయాడు! కట్ చేస్తే రోడ్డుపై పల్టీలు..

సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ సిగ్నల్ వద్ద గురువారం (జూన్‌ 6) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేసేందుకు యత్నించిన కారు మరో కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ తిరగబడింది. కంటోన్మెంట్‌ సికింద్రాబాద్‌ క్లబ్‌ వద్ద ఈ రెండు కార్లు ఢీకొన్నాయి. అసలేం జరిగిందంటే....

Viral Video: సికింద్రాబాద్‌లో ఘోరం.. సిగ్నల్ జంప్‌ చేయబోయాడు! కట్ చేస్తే రోడ్డుపై పల్టీలు..
Secunderabad Car Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2024 | 4:57 PM

హైదరాబాద్, జూన్‌ 6: సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ సిగ్నల్ వద్ద గురువారం (జూన్‌ 6) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేసేందుకు యత్నించిన కారు మరో కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ తిరగబడింది. కంటోన్మెంట్‌ సికింద్రాబాద్‌ క్లబ్‌ వద్ద ఈ రెండు కార్లు ఢీకొన్నాయి. అసలేం జరిగిందంటే..

గురువారం ఉదయం సికింద్రాబాద్‌ క్లబ్‌ వద్ద సిగ్నల్‌ పడిన సమయంలో రోడ్డు దాటుతున్న నల్లని కియా కారెన్స్ కారు.. మరోవైపు నుంచి అడ్డుగా వచ్చిన మరో తెల్లని టొయోటా ఇన్నోవా కారును వేగంగా ఢీకోట్టింది. దీంతో అదుపుతప్పిన కియా కారు రోడ్డుపై మూడు సార్లు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్, స్థానికులు హుటాహుటిన కారులో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం గాయాలపాలైన డ్రైవర్‌తోపాటు కారులోని ఇతర ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

40-సెకన్ల వీడియో క్లిప్‌లో సిగ్నల్‌ పడుతుందన్న తొందరలో కియా కేరెన్స్ కారు డ్రైవర్‌ కారును వేగంగా నడపడం సీసీటీవీ ఫుటేజీలో చూడొచ్చు. సిగ్నల్‌ పడటంలో మరోవైపు నుంచి వచ్చిన కారును అది వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాధంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో