Revanth Reddy-Chandrababu: చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్.. ఏం మాట్లాడారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఎన్డీఏ కూటమి -164 (టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8) స్థానాల్లో విజయం సాధించగా.. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. కాగా.. చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ తిరుగులేని విజయం సాధించడం, మరోసారి అధికారం చేపడుతుండటం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఎన్డీఏ కూటమి -164 (టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8) స్థానాల్లో విజయం సాధించగా.. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. కాగా.. చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ తిరుగులేని విజయం సాధించడం, మరోసారి అధికారం చేపడుతుండటం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి విషెస్ చెప్పారు. 4వ సారి బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ .. పలు విషయాలను కూడా చర్చించారు.
రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరారు. కాగా.. తన నివాసంలో మహబూబాబాద్ నియోజకవర్గ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఇదిలాఉంటే.. రేవంత్ రెడ్డి.. లోక్ సభ ఫలితాల నాటినుంచి వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. లోక్ సభ స్థానాల ఓటమిపై సమీక్షిస్తున్నారు. తాజాగా.. మహబూబాబాద్ నియోజవర్గంపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విప్ రాంచంద్ర నాయక్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..