AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జాక్‌పాట్ కొట్టిన కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు.. చిన్ని కొడుకు ఎమ్మెల్యే.. పెద్ద కొడుకు ఎంపీ!

దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. ముఖ్యంగా రాజకీయాల్లో మాత్రం ఈ సూత్రం తప్పదంటారు. తల పండిన ఆ నేత.. ఇప్పుడు అదే పని చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దిగ్గజం, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఘనాపాటి కుందూరు జానారెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పన్నిన రాజకీయ వ్యూహం ఫలించింది.

Telangana: జాక్‌పాట్ కొట్టిన కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు.. చిన్ని కొడుకు ఎమ్మెల్యే.. పెద్ద కొడుకు ఎంపీ!
Janareddy Family
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 06, 2024 | 4:11 PM

Share

దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. ముఖ్యంగా రాజకీయాల్లో మాత్రం ఈ సూత్రం తప్పదంటారు. తల పండిన ఆ నేత.. ఇప్పుడు అదే పని చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దిగ్గజం, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఘనాపాటి కుందూరు జానారెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పన్నిన రాజకీయ వ్యూహం ఫలించింది.

రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రాజకీయ దిగ్గజం జానారెడ్డి. ఆయన తనయులు ఇద్దరినీ ఏకకాలంలో కేంద్రంలో రాష్ట్రంలోని చట్టసభలకు పంపించడంలో విజయం సాధించారు. జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డిని నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలిపించు కోవడంలో, పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డిని పార్లమెంట్‌కు పంపడంలో జానారెడ్డి సక్సెస్ అయ్యారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన జానారెడ్డి, తన ఛరిష్మాతో ఇద్దరు కొడులను రాజకీయ అరంగ్రేటం చేయించడమేగాక, వారి వెనకాలే ఉండి గెలుపునకు పాటుపడ్డారు.

జానారెడ్డి వయోభారంతో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఏడు సార్లు వరుసగా గెలిచిన జానారెడ్డి తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 2014లో గెలిచారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య, 2020లో జరిగిన ఉప ఎన్నికలో నర్సింహయ్య తనయుడు నోముల భగత్ చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని జానా నిర్ణయించారు.

అయితే దీపం ఉండగానే ఇంటిని చక్క బెట్టుకోవాలనే నానుడిని జానారెడ్డి పాటించారు. క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని భావించిన జానారెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని తనయులు కొనసాగించేలా ప్లాన్ చేశారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనయులను రాజకీయ అరంగ్రేటం చేయించాలని జానారెడ్డి భావించారు. తనకు కంచుకోటగా ఉన్న నాగార్జున సాగర్ నుంచి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి, తనకు పట్టున్న మిర్యాలగూడ నియోజక వర్గం నుంచి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డిలు కాంగ్రెస్ టికెట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నుంచి చిన్న కొడుకు జైవీర్ రెడ్డికి టికెట్ వచ్చింది. తన రాజకీయ చతురతతో జైవీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాడు

తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డిని కూడా రాజకీయం చేయించాలని భావించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా పేరున రఘువీర్ రెడ్డికి నల్గొండ పార్లమెంట్ టికెట్ లభించింది. కాంగ్రెస్ పార్టీనే గాక, కమ్యూనిస్టులను ఏకం చేయడంలో, పార్టీ రహితంగా ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించి కొడుకును గెలిపించుకోగలిగారు. అది కూడా రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీ రావడంలో జానారెడ్డి తనదైన కృషి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…