AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold, Silver Rates: 2025 ఏడాదిలో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలుసా? మైండ్‌ బ్లాంక్‌ అయ్యే వివరాలు!

Year Ender 2025 Gold, Silver Rates: ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. సామాన్యుడు భయపడే రేంజ్‌లో ధరలు దూసుకుపోయాయి. గ్రాము ధర కొలన్నా భయపడే పరిస్థితి తీసుకువచ్చింది బంగారం ధర. ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగింది. గుడ్‌ రిటర్న్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూద్దాం..

Gold, Silver Rates: 2025 ఏడాదిలో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలుసా? మైండ్‌ బ్లాంక్‌ అయ్యే వివరాలు!
Subhash Goud
|

Updated on: Dec 05, 2025 | 4:09 PM

Share

Year Ender 2025 Gold, Silver Rates: ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. సామాన్యుడు భయపడే రేంజ్‌లో ధరలు దూసుకుపోయాయి. గ్రాము ధర కొలన్నా భయపడే పరిస్థితి తీసుకువచ్చింది బంగారం ధర. ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గుడ్‌ రిటర్న్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూద్దాం.. ఈ ఏడాది 2025 జనవరి 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,000 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,500 ఉంది. ఇదే నెలలో చివరి వరకు 24 క్యారెట్ల ధర రూ.84 వేలకు చేరుకుంది.

ఇక ఫిబ్రవరిలో చివరి వరకు ఈ ధర రూ.86,840కు చేరుకుంది. అలాగే మార్చి నెలలో 20వ తేదీ వరకు 24 క్యారెట్ల ధర రూ.90,660 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.83 వేల,310 వద్ద ట్రేడయ్యింది. ఇక ఏప్రిల్‌ విషయానికొస్తే.. ఈ నెలలో 15వ తేదీ వరకు తులం బంగారం ధర 95 వేల రూపాయలు దాటింది. మే నెలలో భారీగా దిగి వచ్చింది. ఇదే సమయానికి తులం బంగారం ధర 93 వేల రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు 2 వేల రూపాయల వరకు దిగి వచ్చింది.

ఇది కూడా చదవండి: Post Office: పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. రూ.15 వేల డిపాజిట్‌తో చేతికి రూ.25 లక్షలు!

ఇవి కూడా చదవండి

ఇక జూన్‌ నెలలో భారీగా పెరిగింది. జూన్‌ 16వ తేదీ వరకు తులం బంగారం ధర 1 లక్షా 1510 రూపాయల వద్ద కొనసాగింది. అలాగే పెరిగిన బంగారం ధర జూలై నెలలో కాస్త దిగి వచ్చింది. జూలై 15వ తేదీన ధరను పరిశీలిస్తే తులం ధర 99,770 రూపాయలకు దిగి వచ్చింది. ఇక్కడ దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది.

ఆగస్ట్‌ నెలలో కాస్త ఎగబాకింది. ఇక్కడ తులం బంగారం ధర లక్షా రూపాయలు దాటేసింది. ఇక సెప్టెంబర్‌ విషయానికొస్తే తులం బంగారం ధర 1 లక్ష 11 వేలు దాటేసింది. ఇదే నెలలో చివరి వరకు అంటే 30వ తేదీ వరకు తలం ధర 1.17 లక్షలకు దాటింది. ఇక అక్టోబర్‌లో మాత్రం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. అక్టోబర్‌ నెల 20వ తేదీ వరకు తులం బంగారం ధర రూ.1,30,690 వద్దకు చేరుకుంది. అంటే సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 20 తేదీ వరకు తులంపై ఏకంగా 13 వేల రూపాయలు పెరిగింది. ఇదే నెలలో చివరన చూస్తే భారీగా దిగి వచ్చింది. అక్టోబర్‌ 30న తులం బంగారం ధర రూ.1,23 వేలకు చేరుకుంది. అంటే దాదాపు 7 వేల రూపాయల వరకు తగ్గింది. అలాగే నవంబర్‌ 5వ తేదీన ధర చూస్తే తులం ధర 1,23,480 రూపాయల వద్దకు చేరుకుంది. అంటే ఒక్కసారిగా ఎగబాకిన ధర దిగి వచ్చిందనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: Christmas Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. క్రిస్మస్‌కు భారీగా సెలవులు..!

అలాగే నవంబర్‌ 20వ తేదీ వరకు చూస్తే మళ్లీ పెరిగింది. ఇక్కడ తులం ధర రూ.1,24,260 వద్దకు చేరుకుంది. ఇదే నెలలో చివరకు అంటే 30వ తేదీన ధర రూ.న1,29,820 రూపాయల వద్దకు చేరుకుంది. ఇదే నెలలో తులం పై దాదాపు 5 వేలకుపైగా పెరిగింది. 1 డిసెంబర్‌ 2025 తులం ధర రూ. లక్షా 30 వేలు దాటింది. ఇక ప్రస్తుతం డిసెంబర్‌ 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయానికి తులం బంగారం ధర రూ.1,29,930 వద్ద ట్రేడవుతోంది. ఏదీ ఏమైనా ఈ 2025లో తులం బంగారంపై రూ.,51,930 వరకు రూపాయలు పెరిగింది. ఒక్క ఏడాదిలో రూ.50 వేలకుపైగా పెరగడం ఆందోళన కలిగించే విషయమే. ప్రస్తుతం గ్రాము ధర కొనాలన్నా సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.

వెండి ధర:

వెండి ధర విషయానికొస్తే ఇదే ఏడాది జనవరిలో కిలో వెండి ధర రూ.90 వేలు ఉంది. ఇక్కడి నుంచి క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చిన ధర ఏడాది మధ్యలో అంటే జూన్‌ నెలలో వెండి ధర రూ1 లక్షా 10 వేలకు చేరుకుంది. ఇక ఇదే సిల్వర్‌ ధర డిసెంబర్‌ 5వ తేదీన కిలో వెండి ధర రూ.1,87,000. ఈ లెక్కన 2025లో మొదట్లో 90 వేలు ఉన్న ధర ఇప్పుడు లక్షా 87 వేల వద్ద ఉంది. అంటే దాదాపు 90 వేల రూపాయలకు పైగా పెరిగింది. వెండిని ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర పరిరాలలో అధికంగా వినియోగిస్తుండటంతో వెండికి డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో బంగారంతో సామానంగా పరుగులు పెడుతోంది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదనేది నిపుణుల వాదన.

ఇది కూడా చదవండి: Auto News: బెస్ట్‌ స్కూటర్‌.. దీనిలో ఫుల్‌ ట్యాంక్ చేస్తే రూ. 238 కి.మీ మైలేజీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి