AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మరీ ఇంత నిర్లక్ష్యమా..? ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు! వైరల్ వీడియో

వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వేపై ఓ విమానం టేకాఫ్‌ అవుతుండగా.. ఆ వెనుకే మరో విమానం ల్యాండ్‌ అయ్యింది. రెండింటికి కేవలం అతికొద్ది దూరం మాత్రమే గ్యాప్‌ ఉండటంతో అంతా హడలెత్తిపోయారు. ఈ షాకింగ్ ఘటన ముంబై ఎయిర్ పోర్టులో శనివారం (జూన్‌ 9) చోటు చేసుకుంది. దీనిపై వేగంగా దర్యాప్తు చేపట్టిన డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్..

Viral Video: మరీ ఇంత నిర్లక్ష్యమా..? ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు! వైరల్ వీడియో
Mumbai Airport Incident
Srilakshmi C
|

Updated on: Jun 09, 2024 | 5:42 PM

Share

ముంబై, జూన్ 9: వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వేపై ఓ విమానం టేకాఫ్‌ అవుతుండగా.. ఆ వెనుకే మరో విమానం ల్యాండ్‌ అయ్యింది. రెండింటికి కేవలం అతికొద్ది దూరం మాత్రమే గ్యాప్‌ ఉండటంతో అంతా హడలెత్తిపోయారు. ఈ షాకింగ్ ఘటన ముంబై ఎయిర్ పోర్టులో శనివారం (జూన్‌ 9) చోటు చేసుకుంది. దీనిపై వేగంగా దర్యాప్తు చేపట్టిన డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. రన్‌వే నిర్వహణకులపై తక్షణ చర్యలు తీసుకుంది. బాధ్యుడైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని సస్పెండ్ చేసింది. అసలేం జరిగిందంటే..

ముంబై ఎయిర్‌పోర్టులో రన్‌వైపై ఇండిగో ఎయిర్‌ క్రాఫ్ట్‌ ల్యాండ్‌ అవుతుండగా.. అదే రన్‌వేపై ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అవుతోంది. ఈ రెండింటికి మధ్య కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌.. ముంబై ఎయిర్‌పోర్టులోని భద్రతా ప్రొటోకాల్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, ముంబై విమానాశ్రయంలోకి అడుగుపెట్టినప్పటి ఉంచి బయటికి వెళ్లే వరకు ప్రయాణికులందరి భద్రతకు కట్టుబడి ఉన్నామని అధికారులు ప్రజలకు హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై స్పందించిన ఇండిగో తమ పైలట్‌ ముంబయి ఎయిర్‌ పోర్టు ఏటీసీ నుంచి వచ్చిన సూచనలను సక్రమంగా పాటించినట్లు పేర్కొంది. జూన్‌ 8న ఇండిగో 6ఈ6053 విమానానికి ఏటీసీ నుంచి ల్యాండింగ్‌ క్లియరెన్స్‌ లభించిందని, తమకు ప్రయాణికుల భద్రమే ముఖ్యమని వివరణ ఇచ్చింది. మరోవైపు ఎయిర్‌ ఇండియా కూడా ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. ఏఐ657 విమానం ముంబై నుంచి త్రివేండ్రం వెళ్లేందుకు ఏటీసీ నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతే టేకాఫ్‌ చేసినట్లు పేర్కొంది. ఎయిర్‌ ఇండియా టేకాఫ్‌ సమయంలో ఇండిగోకు అధికారులు ఎలా క్లియరెన్స్‌ ఇచ్చారనేది తెలియాల్సి ఉందని తన ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.