Vishal Dadlani vs Kangana: కుల్వీందర్‌కు నేను ఉద్యోగం ఇస్తా.! కంగనపై చేయిచేసుకున్న మహిళాకు సపోర్ట్.

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంపఛెళ్లుమనిపించి సస్పెన్షన్‌కు గురైన సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌కు ప్రముఖ బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ఆమెకు మరో జాబ్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన.. తాను హింసను ఎప్పుడూ ఆమోదించనని, కానీ మహిళా కానిస్టేబుల్ చర్యను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు.

Vishal Dadlani vs Kangana: కుల్వీందర్‌కు నేను ఉద్యోగం ఇస్తా.! కంగనపై చేయిచేసుకున్న మహిళాకు సపోర్ట్.

|

Updated on: Jun 09, 2024 | 8:27 PM

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంపఛెళ్లుమనిపించి సస్పెన్షన్‌కు గురైన సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌కు ప్రముఖ బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ఆమెకు మరో జాబ్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన.. తాను హింసను ఎప్పుడూ ఆమోదించనని, కానీ మహిళా కానిస్టేబుల్ చర్యను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. సీఐఎస్‌ఎఫ్ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకున్నా, తాను కుల్వీందర్‌కు మరో జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని,.. జై హింద్, జై జవాన్, జై కిసాన్ అంటూ ఇన్‌స్టాలో వ్యాఖ్యానించారు.

పంజాబ్ రైతుల నిరసనలపై కంగన వ్యాఖ్యలకు భగ్గుమన్న కుల్వీందర్ కౌర్ ఎంపీపై చేయి చేసుకున్నారు. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో జూన్ 6న ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ చెక్ తరువాత బోర్డింగ్ పాయింట్ వైపు వెళ్లబోతున్న కంగనపై మహిళా కానిస్టేబుల్ చేయిచేసుకున్నారు. ఈ ఘటనతో సీఐఎస్‌ఎఫ్ కుల్వీందర్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు, ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వెంటనే కంగనా రనౌత్ మహిళా కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు. రైతులు రూ.100 తీసుకుని నిరసనల్లో పాల్గొన్నారని కంగన అన్నారు. ఆమె ఇలా ఎలా అనగలిగారు. ఆ నిరసనల్లో తన తల్లి కూడా పాల్గొన్నారని కుల్విందర్ కౌర్ వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us