Cooking Oil: గ్యాస్‌ స్టవ్‌ పక్కనే నూనె పెడుతున్నారా.. అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే.!

Cooking Oil: గ్యాస్‌ స్టవ్‌ పక్కనే నూనె పెడుతున్నారా.. అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే.!

Anil kumar poka

|

Updated on: Jun 10, 2024 | 8:51 AM

ఇదేంటి.. ఆరోగ్యానికీ.. గ్యాస్ స్టవ్‌ పక్కన వంట నూనె పెట్టడానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నరా? ఉంది.. సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు అవసరమైన వస్తువులను చేతికి అందేలా పెట్టుకుంటారు. అలాంటి వాటిలో నూనె ఒకటి. వంటల్లో దీని అవసరం ఎక్కువ కాబట్టి స్టవ్‌కు దగ్గర్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఇది అత్యంత ప్రమాదకరమని అధ్యయనంలో తేలింది.

ఇదేంటి.. ఆరోగ్యానికీ.. గ్యాస్ స్టవ్‌ పక్కన వంట నూనె పెట్టడానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నరా? ఉంది.. సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు అవసరమైన వస్తువులను చేతికి అందేలా పెట్టుకుంటారు. అలాంటి వాటిలో నూనె ఒకటి. వంటల్లో దీని అవసరం ఎక్కువ కాబట్టి స్టవ్‌కు దగ్గర్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఇది అత్యంత ప్రమాదకరమని అధ్యయనంలో తేలింది. ఇలా చేయడం వల్ల కేన్సర్ బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్యాస్ స్టవ్ పక్కనే నూనెను ఉంచడం వల్ల ఆ వేడికి నూనెలో ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమవుతుందట. సాధారణంగా నూనెలో కొవ్వులు అధికంగా ఉంటాయి. నూనె భద్రపరిచిన సీసాను కానీ, లేదంటే ప్యాకెట్‌ను కానీ తెరిచిన వెంటనే అందులోని కొవ్వు పదార్థాలు క్షీణించి రుచి మారుతుంది. దుర్వాసన కూడా వస్తుంది. ఈ నూనెను వాడడం వల్ల వృద్ధాప్యం వేగవంతమవడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి ఊబకాయం, జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. ఈ సమస్యల బారినపడకుండా ఉండాలంటే నూనెను తీసుకొచ్చిన వాటిలోనే ఉంచాలి. గాలి, వెలుతురు చొరబడకుండా గట్టిగా మూతపెట్టాలి. వెజిటబుల్ ఆయిల్స్‌ను చల్లగా ఉండే వెలుతురు సోకని చోట ఉంచాలి. మూత తెరిచిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లోపు ఉపయోగించాలి. వాల్‌నట్, హేజెల్‌నట్, ఆల్మండ్ నూనెలను మాత్రం ఫ్రిజ్‌లో భద్రపరచడం మంచిదంటున్నారు నిపుణులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.