Viral: ట్రాఫిక్ సిగ్నల్‌పై పాము.. కేబుల్ వైర్లమీదుగా పాకుతూ.. వీడియో అదుర్స్.
హైదరాబాద్ నగరం హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో త్రాచుపాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద వేప చెట్టుపై ఉన్నట్లుండి ఓ పాము ప్రత్యక్షమైంది. అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ పోల్ పై పాకుతూ కనిపించింది. అది చూసి జనాలు చేస్తున్న పనులు అన్నీ వదులుకుని నడిరోడ్డుపైనే ఆ పామును ఆసక్తిగా చూస్తుండిపోయారు.
హైదరాబాద్ నగరం హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో త్రాచుపాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద వేప చెట్టుపై ఉన్నట్లుండి ఓ పాము ప్రత్యక్షమైంది. అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ పోల్ పై పాకుతూ కనిపించింది. అది చూసి జనాలు చేస్తున్న పనులు అన్నీ వదులుకుని నడిరోడ్డుపైనే ఆ పామును ఆసక్తిగా చూస్తుండిపోయారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొంత మంది తమ ఫోన్లలలో ఆ పాము వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. దాంతో లిబర్టీ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
పామును చూసి జనాలు చేస్తున్న గోలకు, అరుపులకు ఆ పాముకు కూడా ఎటు పోవాలో అర్థంకాక, దొరికితే తనను ఎక్కడ చంపేస్తారోనని భయంతో తీవ్ర గందరగోళానికి గురైంది. చివరకి మెల్లగా విద్యుత్ వైర్ల మీద నుంచి పాకుతూ సిగ్నల్ పోల్ సహాయంతో కిందికి వచ్చింది. ఇంతటి జనసంచారంలోకి పాము ఎలా వచ్చిందో కానీ… పాము కారణంగా అక్కడికి చేరుకున్న జనాలను కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారింది. ఎట్టకేలకు పాలము కిందకు దిగి పక్కనే ఉన్న ఖాళీ బిల్డింగ్ వైపు పాకుతూ వెళ్లిపోయింది. సినిమా అయిపోయింది అన్నట్లు పోలీసులు పాము వెళ్లిపోగానే ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్న జనాలను, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.