Wife Birthday: భార్య పుట్టిన రోజు మర్చిపోతే.. జైలుకే.! ప్రత్యేక చట్టం అమలు..
మీ ప్రియమైన సతీమణి పుట్టిన రోజును పట్టించుకోలేదా? బిజీలో ఉండి విషెస్ చెప్పడం కుదరలేదా? భార్య బర్త్ డేట్‌ను మొత్తానికే మర్చిపోయారా? అయితే ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే. భార్య పుట్టిన రోజును మర్చిపోతే ఏకంగా జైలుకే పంపిస్తారట. భయపడకండి ఇది మనదేశంలోనైతే కాదు.. అమెరికా సమీపంలో ఉండే పాలీనేసియన్ ఐల్యాండ్ సమోవా అనే దేశంలో ఈ శిక్ష అమలు చేస్తున్నారు.
మీ ప్రియమైన సతీమణి పుట్టిన రోజును పట్టించుకోలేదా? బిజీలో ఉండి విషెస్ చెప్పడం కుదరలేదా? భార్య బర్త్ డేట్‌ను మొత్తానికే మర్చిపోయారా? అయితే ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే. భార్య పుట్టిన రోజును మర్చిపోతే ఏకంగా జైలుకే పంపిస్తారట. భయపడకండి ఇది మనదేశంలోనైతే కాదు.. అమెరికా సమీపంలో ఉండే పాలీనేసియన్ ఐల్యాండ్ సమోవా అనే దేశంలో ఈ శిక్ష అమలు చేస్తున్నారు. ఎవరైనా సరే పొరపాటున భార్య పుట్టిన రోజున మర్చిపోతే అక్కడ జైలుశిక్ష విధించే నేరంగా భావిస్తారు. పుట్టినరోజుకు భర్త ప్రేమతో ఇచ్చే చిరు కానుక కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది కదా! ఏమీ ఇవ్వకున్నా ఆ రోజును గుర్తుంచుకుని శుభాకాంక్షలు చెప్పినా చాలనుకునే సతీమణులు ఉంటారు. కానీ, మగవాళ్లు మాత్రం గుర్తులేదు.. పనిలో పడి మర్చిపోయా..అంటూ రకరకాల కారణాలు చెప్పుతూ అప్పటికీ ఏదో సర్దిచెప్పుతారు. భార్యలు కూడా దాన్ని మర్చిపోయి.. సర్దుకుపోతుంటారు. అయితే, సమోవా దేశంలో మాత్రం అంత తేలిగ్గా తీసుకోరట. ఇక్కడ భార్య పుట్టినరోజును మర్చిపోతే ఇక వాళ్ల పని అంతే.
సమోవా దేశంలో అక్కడి ప్రభుత్వం ఏకంగా ఓ చట్టమే చేసింది. పైగా ఈ చట్టం సరిగా అమలవుతుందా? లేదా అనేది చూడడానికి ప్రత్యేకంగా పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారట. భార్య పుట్టిన రోజును మొదటిసారి మర్చిపోతే పోలీసులు భర్తకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారట. అదే పొరపాటు రెండోసారీ చేస్తే వాళ్లకు జరిమానా లేదా గరిష్ఠంగా ఐదేళ్లపాటు జైలు శిక్ష కూడా వేస్తారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తారు. అంతేకాదు, భార్యకు తన హక్కుల గురించి, ఈ చట్టం గురించి అవగాహన కల్పించడానికి దేశమంతా క్యాంపులనూ నిర్వహిస్తారట. అయితే ఇలాంటి చట్టం మనదేశంలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి.. జైళ్లన్నీ నిండిపోతాయేమో కదా!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.