PM Modi Swearing-in Ceremony: ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి రజనీకాంత్.. టాలీవుడ్ నుంచి ఎవరంటే?

భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ నేడు (జూన్ 09) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి కొందరు విదేశీ అతిథులతో పాటు దేశంలోని పలువురు ముఖ్య రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు.

PM Modi Swearing-in Ceremony: ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి రజనీకాంత్.. టాలీవుడ్ నుంచి ఎవరంటే?
PM Modi Swearing-in Ceremony
Follow us
Basha Shek

|

Updated on: Jun 09, 2024 | 5:15 PM

భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ నేడు (జూన్ 09) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి కొందరు విదేశీ అతిథులతో పాటు దేశంలోని పలువురు ముఖ్య రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఇప్పటికే కొన్ని దేశాల ప్రధానులు భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న కొద్ది గంటల్లోనే భారతీయ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా దక్షిణ భారతానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా మోడీ ప్రమాణ స్వీకార మహత్సవంలో పాల్గొననున్నారు. ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ఢిల్లీ చేరుకుని మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటున్నట్లు రజనీకాంత్ తెలిపారు.ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కాగా ఢిల్లీలో మీడియాతో రజనీకాంత్ మాట్లాడారు. నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని అవుతున్న మోదీకి ఏం చెప్పాలనుకుంటున్నారని రిపోర్టర్లు రజనీని ప్రశ్నించారు. దీనికి స్పందించిన సూపర్ స్టార్’ఇది చారిత్రాత్మక ఘట్టం, మూడోసారి ప్రధాని అవుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు’ అని బదులిచ్చి వెళ్లిపోయారు. రజనీకాంత్ గతంలో ప్రధాని మోదీని కొన్ని సార్లు కలిశారు. కాగా ఇటీవల సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన రజనీకాంత్‌.. ఆయన పాదాలకు నమస్కరించి తీవ్ర విమర్శలకు గురయ్యారు.

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా పాల్గొననున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి ఇంటి నుంచి బయల్దేరిన సందర్భంగా అనిల్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ, ‘దేశం పురోగమిస్తుంది, ప్రతిచోటా సానుకూల వాతావరణం ఉంది. అందరికీ మంచి జరగాలి’. అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మలయాళ నటుడు సురేష్ గోపీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా మోడీ ప్రమాణ స్వీకారానికి టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళుతున్నారన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే జనసేన అధిపతిగా పవన్ కల్యాణ్ ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు..

కాగా ఇవాల రాత్రి 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఏపీ టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కింది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కి ఈసారి కేబినెట్‌ బెర్త్‌ కన్‌ఫాం అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.