T20 World Cup 2024: ఏంటి భయ్యా కుస్తీ పోటీలనుకున్నావా? డకౌట్ అయ్యి అభిమానితో గొడవకు దిగిన పాక్ ప్లేయర్.. వీడియో

పసికూన చేతిలో పరాజయం పాలు కావడంతో పాక్ క్రికెటర్లపై అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాగా ఈమ్యాచ్ లో పాక్ ఓటమికి పాకిస్తాన్ బ్యాటర్లే ప్రధాన కారణమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, వైస్‌ కెప్టెన్‌ షదాబ్‌ ఖాన్‌ మినహా

T20 World Cup 2024: ఏంటి భయ్యా కుస్తీ పోటీలనుకున్నావా? డకౌట్ అయ్యి అభిమానితో గొడవకు దిగిన పాక్ ప్లేయర్.. వీడియో
Pakistan Cricketer Azam Khan
Follow us
Basha Shek

|

Updated on: Jun 07, 2024 | 1:22 PM

టీ20 ప్రపంచకప్‌లో ఫేవరేట్‌ గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే షాక్‌ తగిలింది. క్రికెట్ ప్రపంచంలో పసి కూనగా పేరున్న ఆతిథ్య జట్టు అమెరికా చేతిలో దాయాది జట్టు దారుణంగా ఓడిపోయింది. సూపర్ 8కి అర్హత సాధించాలని కలలు కంటున్న పాకిస్థాన్ కు ఈ ఓటమి భారీ షాక్ ఇచ్చింది. మరోవైపు పసికూన చేతిలో పరాజయం పాలు కావడంతో పాక్ క్రికెటర్లపై అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాగా ఈమ్యాచ్ లో పాక్ ఓటమికి పాకిస్తాన్ బ్యాటర్లే ప్రధాన కారణమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, వైస్‌ కెప్టెన్‌ షదాబ్‌ ఖాన్‌ మినహా మిగతా బ్యాటర్లంతా అమెరికాతో మ్యాచులో దారుణంగా విఫలం అయ్యారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ హల్క్‌, ఫినిషర్‌గా ఉన్న ఆజమ్‌ ఖాన్‌ అయితే అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో మరీ దారుణంగా గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టీ20ల సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కూడా ఆజమ్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఆజమ్ ఖాన్ భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇప్పుడు ఎంతో కీలకమైన టీ20 వరల్డ్‌ కప్‌లోనూ అదే పేలవమైన ఫామ్ న కొనసాగించాడు ఆజామ్. వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజుల్లోకి వచ్చిన ఆజమ్‌ ఖాన్‌ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. దీంతో అతనిపై పాకిస్థాన్ క్రికెట్‌ అభిమానులు అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

కాగా మ్యాచ్‌లో ఆజమ్‌ ఖాన్‌ అవుటై.. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో కూడా కొందరు పాక్‌ క్రికెట్ అభిమానులు ఆజమ్‌ ఖాన్‌ను ట్రోల్‌ చేశారు. ‘మోటా హాతీ’(లావు ఏనుగు) అంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆజమ్ ఖాన్ కు కోపం కట్టలు తెచ్చుకుంది. తనను కామెంట్ చేసిన అభిమానితో అక్కడే గొడవకు దిగాడు. ఈ సీన్ తో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఒక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఒక క్రికెటర్ పై ఇలాంటి చెత్త కామెంట్లు చేయడం తగదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆజమ్‌ ఖాన్‌పై కూడా ట్రోలింగ్‌ జరుగుతుంది. తన తండ్రి మొయిన్ ఖాన్ మాజీ క్రికెటర్‌ కాబట్టి అతనిని పాక్ టీమ్‌లో చేర్చు కున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులతో గొడవ పడకుండా ఆటపై దృష్టి సారించాలంటూ హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

అభిమానితో ఆజామ్ ఖాన్ గొడవ  వీడియో ఇదిగో..

. ఫొటోస్ ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..