Team India: ఆశిష్ నెహ్రాతో ఆటోగ్రాఫ్ తీసుకుంటోన్న ఈ పిల్లాడు ఇప్పుడు టీమిండియా కీ ప్లేయర్.. గుర్తు పట్టారా?

ఈ ఫొటోలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్, ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ చేతుల ఆశిష్ నెహ్రాను కూడా చూడొచ్చు. ఇందులో తన బ్యాట్ పై నెహ్రా ఆటో గ్రాఫ్ ను తీసుకుంటూ ఎంతో క్యూట్ గా కనిపించాడీ క్రికెటర్. మరీ ఈ భారత ప్లేయర్ ఎవరో గుర్తు పట్టారా? క్రికెట్ అభిమానులయితే ఈజీగా  గుర్తు పట్టవచ్చు.

Team India: ఆశిష్ నెహ్రాతో ఆటోగ్రాఫ్ తీసుకుంటోన్న ఈ పిల్లాడు ఇప్పుడు టీమిండియా కీ ప్లేయర్.. గుర్తు పట్టారా?
Team India
Follow us

|

Updated on: Jun 07, 2024 | 2:46 PM

క్రికెటర్ల త్రో బ్యాక్ ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అందులో వారిని గుర్తించడం చాలా కష్టం. చాలా ఫొటోలు క్రికెటర్ల బాల్యానికే సంబంధించి ఉంటాయి. కొన్ని సార్లు ఇలాంటి త్రో బ్యాక్ ఫొటోలను స్వయంగా ఆటగాళ్లే షేర్ చేసుకుంటారు. ఇంకొన్ని సార్లు అభిమానులు నెట్టింట పంచుకుంటారు. క్రికెటర్ల పాత చిత్రాలు వారి అభిమానులకు కూడా బాగా నచ్చుతాయి. అలా టీమిండియా స్టార్ క్రికెటర్ కు సంబంధించిన ఒక చిన్ననాటి ఫోటో బాగా ఆకట్టుకుంటోంది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్, ఐపీఎల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ చేతుల ఆశిష్ నెహ్రాను కూడా చూడొచ్చు. ఇందులో తన బ్యాట్ పై నెహ్రా ఆటో గ్రాఫ్ ను తీసుకుంటూ ఎంతో క్యూట్ గా కనిపించాడీ క్రికెటర్. మరీ ఈ భారత ప్లేయర్ ఎవరో గుర్తు పట్టారా? క్రికెట్ అభిమానులయితే ఈజీగా  గుర్తు పట్టవచ్చు. మిగతా వారు కొంచెం కష్టమే. అలాంటి వారికో క్లూ కూడా ఇస్తున్నాం.

ఇవి కూడా చదవండి

ఈ టీమిండియా క్రికెటర్ కొన్ని నెలల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డాడు. మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చాడు. కానీ అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయట పడ్డాడు. సుమారు ఒకటిన్నర సంవత్సరం పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇటీవలే ఐపీఎల్ తో గ్రాంట్ ఎంట్రీ ఇచ్చాడు. మునపటి స్థాయిలో ధాటిగా ఆడలేకపోయినా భారీ స్కోర్లు ఆడుతున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు టీమిండియా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ రిషభ్ పంత్.

2022 డిసెంబర్‌లో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ దాదాపుఏడాదిన్నర  పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్ ఐపీఎల్ ద్వారా క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. అక్కడ ధనా ధన్ ఇన్నింగ్స్ లు ఆడిన పంత్.. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఇప్పుడు పంత్ జట్టు ప్రధాన వికెట్ కీపర్ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..