PM modi: అధికారికంగా మోదీ ప్రధాని బాధ్యతలు.. తొలి సంతకం దేనిపై చేశారంటే

మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత సంక్షేమానికి జై కొట్టారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. పీఎం కిసాన్‌ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు...

PM modi: అధికారికంగా మోదీ ప్రధాని బాధ్యతలు.. తొలి సంతకం దేనిపై చేశారంటే
Pm Modi
Follow us

|

Updated on: Jun 10, 2024 | 12:23 PM

దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో మోదీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మోదీ అధికారికంగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక మూడోసారి ప్రధాని అయిన మోదీ తొలి సంతకం దేనిపై చేస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది.

మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత సంక్షేమానికి జై కొట్టారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. పీఎం కిసాన్‌ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు సంబంధించిన దస్త్రంపై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు. ఈ ఐదేళ్లలో రైతుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని ఈ సందర్భగా మోదీ తెలిపారు.

కాగా పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు రెండు వేలు చొప్పున 20వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి. ఇదిలా ఉంటే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మోదీ ఈరోజు తొలి కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ఉండనుంది. అయితే అంతలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తికానుందని తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్ధేశం చేయనున్నారు. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు