Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Who is Pro-tem Speaker: ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్‌ను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?

భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి 18వ లోక్‌సభ ఏర్పాటుపైనే ఉంది. సాధారణంగా కొత్త లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఏ నేతకు ఏ మంత్రి హోదా లభిస్తుంది? మంత్రిమండలి కూర్పు ఎలా ఉంటుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంటుంది. అయితే అంతకన్నా ముందే ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకోవల్సి ఉంటుంది..

Who is Pro-tem Speaker: ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్‌ను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?
Pro Tem Speaker
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 10, 2024 | 12:15 PM

భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి 18వ లోక్‌సభ ఏర్పాటుపైనే ఉంది. సాధారణంగా కొత్త లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఏ నేతకు ఏ మంత్రి హోదా లభిస్తుంది? మంత్రిమండలి కూర్పు ఎలా ఉంటుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంటుంది. అయితే అంతకన్నా ముందే ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకోవల్సి ఉంటుంది. అసలు ప్రొటెం స్పీకర్ పదవి అంటే ఏమిటి? వీరిని ఎలా ఎంపిక చేస్తారు? ఈ పదవిలో ఉన్న వ్యక్తి విధులు- బాధ్యతలు ఏమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 94లోని రెండవ అధికరణ ప్రకారం.. కొత్త లోక్‌సభ మొదటి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీగా ఉంటుంది. స్పీకర్‌ స్థానంలో ప్రొటెం స్పీకర్‌ను ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి నియమించిన సభ్యుడే స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలా లోక్‌సభ తొలి సమావేశానికి ప్రొటెం స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు.

ప్రొటెం స్పీకర్‌ను ఎలా ఎంపిక చేస్తారు?

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీనియర్ సభ్యుల జాబితాను రూపొందిస్తారు. ఈ సీనియారిటీ జాబితాను వారి వయస్సు ఆధారంగా కాకుండా.. లోక్‌సభతో పాటు రాజ్యసభలో పదవీకాలం ఆధారంగా వారి సీనియారిటీని నిర్ణయిస్తారు. ఈ జాబితాను ప్రధానికి అందజేస్తారు. ప్రధాని ఓ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా గుర్తిస్తారు. అలాగే మరో ముగ్గురు సభ్యులను కూడా ప్రధాని ప్రతిపాధిస్తారు. ప్రధాని ఆమోదం తర్వాత ఈ పదవికి ఎన్నికైన సభ్యుల సమ్మతి కూడా తీసుకుంటారు. ఈ బాధ్యతను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చేస్తారు. ప్రొటెం స్పీకర్, ఇతర ముగ్గురు సభ్యుల నియామకంపై ఆమోదం కోరుతూ మంత్రి రాష్ట్రపతికి నోట్‌ను సమర్పిస్తారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ప్రొటెం స్పీకర్‌తో పాటు ముగ్గురు సభ్యుల సమక్షంలో ఎంపీలుగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సన్నాహాలు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

ప్రొటెం స్పీకర్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఎప్పుడు?

ప్రొటెం స్పీకర్‌తో రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారం జరగనుంది. కార్యక్రమ ఏర్పాట్లు, ప్రజలకు ఆహ్వానాలు పంపే పని రాష్ట్రపతి సెక్రటేరియట్ ద్వారా జరుగుతుంది. ఈ సమయంలో రాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వంటి ప్రముఖులు ఉంటారు. సభలోని మిగిలిన ముగ్గురు సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. లోక్‌సభ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి కాబట్టి సాధారణంగా ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం కూడా అదే రోజు ఉదయం 9.30 గంటలకు జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమాణ స్వీకారానికి అరగంట ముందు నియమించబడిన ప్రొటెం స్పీకర్ నివాసంలో సమావేశమవుతారు. రాష్ట్రపతి భవన్‌కు చేరుకోవడానికి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి కారు ఏర్పాటు చేస్తారు.

ప్రొటెం స్పీకర్ విధులు ఏమిటి?

ప్రొటెం స్పీకర్ తాత్కాలిక స్పీకర్. అతను పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలలో కార్యకలాపాలను నిర్వహించడానికి పరిమిత కాలానికి నియమించబడిన స్పీకర్‌ అన్నమాట. లోక్‌సభ లేదా అసెంబ్లీ తొలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. అడ్మినిస్ట్రేషన్‌తో పాటు, కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేసే బాధ్యత కూడా ప్రొటెం స్పీకర్‌పై ఉంటుంది. అందుకు ప్రొటెం స్పీకర్‌తోపాటు నియమించిన మిగతా ముగ్గురు సభ్యుల సహాయాన్ని పొందవచ్చు. ప్రొటెం స్పీకర్ ఓటింగ్‌ నిర్వహించి.. పార్లమెంట్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నియామకాలకు బాధ్యత వహిస్తారు. కొత్త స్పీకర్‌ ఎన్నిక జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ పదవి నిలిచిపోతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.