Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: చల్లని కబురు.. వచ్చే 5 రోజులు ఈదురు గాలుతో కూడిన భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ..

Rain Alert: చల్లని కబురు.. వచ్చే 5 రోజులు ఈదురు గాలుతో కూడిన భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Weather Update
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 10, 2024 | 10:42 AM

హైదరాబాద్‌, జూన్‌ 10: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబై, తెలంగాణతో సహా మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. ముంబయి, మరఠ్వాడా, కొంకణ్ గోవా, మధ్య కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది. మరోవైపు కోస్తాంధ్రా, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

దీంతో రానున్న 5 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బెంగాల్, సిక్కింలలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. వర్షాల నేపథ్యంలో కేరళలోని పతనంతిట్ట, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగోడ్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో ఎనిమిది జిల్లాలకు అంటే తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, మలప్పురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో 040-21111111, 9001136675 నంబర్లలను సంప్రదించాలని అధికారులు సూచించారు. యాదాద్రి-భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, మహబూబాబాద్‌, నారాయణ్‌పేట్‌, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.