ముందుగా బోన్‌లెస్ చికెన్ ముక్కలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, కొంచం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
స్టెప్ - 2
15 నుంచి 20 నిముషాల పాటు మ్యారినేట్ చేయాలి. ఇలా చేస్తే కర కర లాడుతాయి.
స్టెప్ - 3
ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను తీసుకుని మైదాలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి, అది వేడయ్యాక మీడియం మంటపై చికెన్ నగ్గెట్స్ వేసి బాగా వేయించాలి.
స్టెప్ - 4
గోల్డ్ రంగులోకి మారే వరకు గరిటెతో తిప్పుతూ వేయించండి. ఆ తర్వాత టిష్యు పేపర్ మీద పెట్టి ఆవిరి పీల్చుకుని దాని మీదే ఉంచండి.