Pawan Kalyan Special Story: పవన్ తుఫాన్.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్నారు.. రాజకీయాలనే మలుపుతిప్పారు.

పవన్ కాదు తుఫాన్. ఇంతకు మించి ప్రశంస మరొకటి ఉండదేమో. పవన్‌ వేగం ఢిల్లీని తాకింది కాబట్టే ప్రధాని మోదీ నుంచి ఆమాట వినిపించింది. కాని, అంతటి తుఫాన్‌ను కేవలం సహనంతోనే సృష్టంచారు పవన్. పార్టీ పెట్టిన నెలల్లోనే, ఒకట్రెండేళ్లలోనే మూసేసుకున్న వాళ్లున్నారు. కాని, ఓర్పు, సహనం, త్యాగం, వ్యూహంతో రాణించింది మాత్రం జనసేనుడే. ఒక ఆవేదన నుంచి పుట్టుకొచ్చిందీ సహనం.

Pawan Kalyan Special Story: పవన్ తుఫాన్.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్నారు.. రాజకీయాలనే మలుపుతిప్పారు.

|

Updated on: Jun 10, 2024 | 11:39 AM

పవన్ కాదు తుఫాన్. ఇంతకు మించి ప్రశంస మరొకటి ఉండదేమో. పవన్‌ వేగం ఢిల్లీని తాకింది కాబట్టే ప్రధాని మోదీ నుంచి ఆమాట వినిపించింది. కాని, అంతటి తుఫాన్‌ను కేవలం సహనంతోనే సృష్టంచారు పవన్. పార్టీ పెట్టిన నెలల్లోనే, ఒకట్రెండేళ్లలోనే మూసేసుకున్న వాళ్లున్నారు. కాని, ఓర్పు, సహనం, త్యాగం, వ్యూహంతో రాణించింది మాత్రం జనసేనుడే. ఒక ఆవేదన నుంచి పుట్టుకొచ్చిందీ సహనం. 2019లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడించడంతో రాజకీయాల్లో తన స్థానం ఏంటో అర్థం చేసుకున్నారు. పార్టీకి అధినేతగా కేవలం ఒకే ఒక్కరిని గెలిపించుకున్నప్పుడు.. రాజకీయం అంటే ఏంటో తెలుసుకున్నారు. అంతే తప్ప వెనకడుగు వేయలేదు. ఓర్చుకుంటూ నేర్చుకుంటూ గెలుపుదారిలో సాగిపోవాలనుకున్నారు. ఆ దారిలోనే.. తానో మాట చెప్పారు. ‘సభలకు వస్తారు, చప్పట్లు కొడతారు, ఓట్లేసే సమయానికి వదిలేసి వెళ్తారు’ అని. అయినా సరే తాను జనం కోసమే పని చేస్తుంటానని చెప్పుకొచ్చారు. ఇదీ సహనం అంటే.

కొన్నికొన్ని కేవలం సహనంతోనే సాధించలేం. వ్యూహం కూడా కావాలి. ఆ సమయంలోనే పుట్టుకొచ్చిందీ ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అనే వ్యూహం. ఈ ఒక్క మాట ఏపీ రాజకీయాలను సమూలంగా మార్చేసింది. ఆనాడు ప్రత్యర్ధులకు ఇదో సినిమా డైలాగ్‌లా అనిపించింది. కాని, ఆ స్టేట్‌మెంట్‌ వెనక సౌండ్‌ ఎంత అనేది ఇప్పుడు వినిపించింది. పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా.. అనే అభిమానుల నినాదాన్ని నిజం చూస్తూ.. అట్టా ఇట్టా కాదు.. ఏకంగా 70వేలకు పైగా మెజారిటీతో గెలిచి చూపించారు పవన్. కేవలం తానొక్కడే గెలవడం కాదిక్కడ.. తనతో పాటు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన తన వాళ్లందరినీ సభకు తీసుకెళ్తున్నారు. ‘ఓటు చీలనివ్వను’ అనే మాటకు అర్థం, దాని వెనక ఉన్న వ్యూహం ఇదీ. కాని, పొత్తు ప్రకటన చేయగానే ఎంత దాడి జరిగిందో..! దమ్ముంటే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీచేయాలని వైసీపీ నుంచి ఎన్ని సవాళ్లు వచ్చాయో..! ముఖ్యంగా జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులే టార్గెట్‌గా ఓ ప్రత్యేక వ్యూహంతో వెళ్లింది వైసీపీ. ఎలాగైనా పొత్తు కుదరొద్దనే లక్ష్యంతో..! కాని, పవన్‌కు బాగా తెలుసు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే పొత్తే సరైన వ్యూహమని తెలుసు. అందుకే, ప్రత్యర్థి ట్రాప్‌లో పడలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles