Watch Video: మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటి ముందు తెలుగు యువత ఆందోళన..
ఏపీలో మాజీమంత్రి అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆందోళన సెగ తగిలింది. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత ఆందోళన చేపట్టింది. ఆయన ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన తెలుగు యువత కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొంతసేపు తెలుగుదేశం కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా ఇరువురి మధ్య వాగ్వాదం తరువాత ఆందోళనకారులు మాజీ మంత్రి అంబటి రాంబాబు చిత్రపటానికి బొట్టు పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోత్సవానికి ఆహ్వానించారు.
ఏపీలో మాజీమంత్రి అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆందోళన సెగ తగిలింది. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత ఆందోళన చేపట్టింది. ఆయన ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన తెలుగు యువత కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొంతసేపు తెలుగుదేశం కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా ఇరువురి మధ్య వాగ్వాదం తరువాత ఆందోళనకారులు మాజీ మంత్రి అంబటి రాంబాబు చిత్రపటానికి బొట్టు పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోత్సవానికి ఆహ్వానించారు. ఒక కుర్చీపై ఆయన చిత్రపటాన్ని ఉంచి.. పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు అలంకరించి నానా హంగామా చేశారు. కాసేపటి తరువాత పరిస్థితి సర్థుమణిగింది. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంనుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. దీంతో రెచ్చిపోయిన యువత ఇలా వినూత్న కార్యక్రమానికి తెరలేపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

