Kishan Reddy: చంద్రబాబు, నితీష్‌ను ఇండియా కూటమి రెచ్చగొడుతోంది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

బీజేపీలో సంస్థాగతంగా కీలక మార్పులు జరగబోతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో మరొకరిని తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాఖకూ కొత్త సారథి నియామకం జరగబోతుందన్నారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 10, 2024 | 9:51 AM

బీజేపీలో సంస్థాగతంగా కీలక మార్పులు జరగబోతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో మరొకరిని తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాఖకూ కొత్త సారథి నియామకం జరగబోతుందన్నారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారం పూర్తయిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులపై త్వరలోనే కసరత్తు చేసి కొత్తవారిని నియమిస్తారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ఇండియా కూటమిది దివాళాకోరు రాజకీయమని విమర్శించారు కిషన్‌రెడ్డి. ప్రధాని ప్రమాణస్వీకారానికి ప్రతిపక్షం రాకపోవడం ఇదే మొదటిసారి అన్నారు. చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్ ను ఇండియా కూటమి రెచ్చగొడుతుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఎన్నికలకు ముందే చంద్రబాబు, నితీష్‌తో పొత్తు పెట్టుకున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాణానికి ముందు కొత్త కేబినెట్‌కు మోదీ దిశానిర్దేశం చేశారని.. మంత్రులు నడుచుకోవాల్సిన విధానంపై హితబోధ చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.

కిషన్ రెడ్డి వీడియో..

కాగా.. కిషన్ రెడ్డి నిన్న రాత్రి కేంద్రమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిపారు.. మోదీ 3.0లో సర్కార్ లో కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?