AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasprit Bumrah: టీమిండియాకు ఊహించని దెబ్బ.. లాంగ్ ఫార్మాట్‌కు బూమ్రా గుడ్‌బై ?

Jasprit Bumrah: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పదే పదే గాయాల కారణంగా లాంగ్ ఫార్మాట్‌లో అతడి భవిష్యత్తుపై చర్చ మొదలైంది. టెస్టులు, వన్డేలలో బుమ్రా వర్క్ లోడ్ తగ్గించి, భవిష్యత్తులో పరిమిత ఓవర్లకే అందుబాటులో ఉంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

Jasprit Bumrah: టీమిండియాకు ఊహించని దెబ్బ.. లాంగ్ ఫార్మాట్‌కు బూమ్రా గుడ్‌బై ?
Jasprit Bumrah
Rakesh
|

Updated on: Aug 12, 2026 | 5:38 PM

Share

Jasprit Bumrah: భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయాల సమస్య మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో బుమ్రా బరిలోకి దిగుతాడని భావించినప్పటికీ, అతను గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ఎడమ మోకాలి గాయానికి పునరావాసం పొందుతున్న బుమ్రా, టెస్టు ఫార్మాట్‌కు అవసరమైన ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దీంతో అతని స్థానంలో జమ్మూ కాశ్మీర్ యంగ్ పేసర్ ఆకిబ్ నబీని భారత టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు.

బుమ్రా లేని టీమిండియాను ఊహించుకోవాల్సిందేనా?

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. బుమ్రా పదే పదే గాయాల బారిన పడుతుండటంతో భారత క్రికెట్ జట్టు యాజమాన్యం ఇకపై బుమ్రా లేని టీమిండియాను లాంగ్ ఫార్మాట్‌లో సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత బుమ్రాను కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ ఫార్మాట్‌లో సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం వల్ల అతని శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందని, అందుకే టెస్టులు, వన్డేల నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వడం లేదా తగ్గించడం మేలని నిపుణులు భావిస్తున్నారు.

ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్.. పదే పదే గాయాలు

జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ వినూత్న యాక్షనే అతనికి వికెట్లు తెచ్చిపెట్టినప్పటికీ, అదే అతని శరీర భాగాలపై, ముఖ్యంగా వీపు మరియు మోకాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే అతను గత కొన్నేళ్లుగా కీలకమైన టోర్నీలకు దూరమవుతూ వస్తున్నాడు. అయినప్పటికీ, ఇప్పటివరకు భారత్ తరఫున టెస్టుల్లో 234 వికెట్లు, వన్డేల్లో 151 వికెట్లు, టీ20ల్లో 121 వికెట్లు తీసి ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా కొనసాగుతున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us