TGPSC Group 1 Exam: తప్పతాగి.. గ్రూప్‌ 1 పరీక్ష విధులకు హజరైన ఉద్యోగి! ఎక్కడంటే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఓ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫూటుగా మద్యం సేవించి విధులకు హజరయ్యాడు. పరీక్ష సమయంలో తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన..

TGPSC Group 1 Exam: తప్పతాగి.. గ్రూప్‌ 1 పరీక్ష విధులకు హజరైన ఉద్యోగి! ఎక్కడంటే..
Govt Employee Under Influence Of Alcohol
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 10, 2024 | 8:17 AM

కరీంనగర్‌, జూన్‌ 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఓ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫూటుగా మద్యం సేవించి విధులకు హజరయ్యాడు. పరీక్ష సమయంలో తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో ఆదివారం (జూన్‌ 9) చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే..

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మీర్జా పర్వేజ్‌ బేగ్‌ అనే ఉద్యోగికి.. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కాలేజీలోని సెంటర్‌లో ఐడెంటిఫికేషన్‌ ఆఫీసర్‌గా డ్యూటీ వేశారు. ఆదివారం ఉదయం పరీక్ష ప్రారంభ సమయానికి.. అప్పటికే మద్యం తాగి సెంటర్‌కు చేరుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.

అభ్యర్థులు అందరూ తమకు కేటాయించిన గదుల్లోకి వెళ్లగానే బయటకు వచ్చి.. పక్కనే ఉన్న వైన్స్‌లో బీరు కొనుగోలు చేశాడు. అనంతరం రోడ్డు పక్కన తాగుతూ కనిపించాడు. గమనించిన పోలీసులు వెంటనే అడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కి చేరుకున్న తర్వాత కూడా ఎస్సైల మీదికే తిరగబడుతూ హల్‌ చల్ చేశాడు. పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ నిర్వహించగా.. పరీక్షలో 173 శాతం ఆల్కహాల్‌ పాజిటివ్‌ వచ్చింది. పైగా ఐడెంటిఫికేషన్‌ ఆఫీసర్‌గా అభ్యర్థులు సెంటర్‌లోకి వెళ్లేవరకే తన డ్యూటీ అని, తన డ్యూటీ అయిపోయాకే బయటకు వచ్చానని, అసలు తననెందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారని స్టేషన్‌లోని పోలీస్‌ సిబ్బందితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు, గన్నేరువరం ఎస్సై నరేశ్‌తోపాటు పోలీసులతో మీర్జా పర్వేజ్‌ బేగ్‌ గొడవపడ్డాడు. అదే రోజు మధ్యాహ్నం రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తోన్ మరో ఉద్యోగితోపాటు, కుటుంబసభ్యులు వచ్చి ఆ ఉద్యోగిని స్టేషన్‌ నుంచి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.