Hyderabad: నార్సింగి వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో వీడిన మిస్టరీ.. అసలు కథ ఇదీ!

అర్ధరాత్రి వ్యాపారవేత్తను కిడ్నాప్‌ చేసిన కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీల కారణంగా వ్యాపారిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఆదివారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రమణ గౌడ్‌ వివరాలను వెల్లడిస్తూ..

Hyderabad: నార్సింగి వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసులో వీడిన మిస్టరీ.. అసలు కథ ఇదీ!
Narsingi Business Man Kidnap Case
Follow us

|

Updated on: Jun 10, 2024 | 7:48 AM

మణికొండ, జూన్‌ 9: అర్ధరాత్రి వ్యాపారవేత్తను కిడ్నాప్‌ చేసిన కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీల కారణంగా వ్యాపారిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఆదివారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రమణ గౌడ్‌ వివరాలను వెల్లడిస్తూ..

కర్నూలుకు చెందిన శేషు వర్ధన్‌ రెడ్డి (37) తన కుటుంబంతో హైదర్షాకోట్‌లోని ఫోర్ట్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో కాపురం ఉంటున్నాడు. శేషు వర్ధన్‌కు గోల్డ్‌, ఎలక్ట్రానిక్‌ వ్యాపారాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కర్నూల్‌కు చెందిన అందే క్రాంతికుమార్‌(36)తో శేషు వర్ధన్‌కు విబేధాలు వచ్చాయి. క్రాంతికుమార్‌కు శేషు వర్ధన్‌ కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంది. అయితే.. డబ్బులు అడిగిన ప్రతిసారి రేపుమాపు అంటూ దాట వేస్తూ.. ముప్పుతిప్పలు పెడుతున్న శేషు వర్ధన్‌పై క్రాంతి కుమార్ కక్ష్య పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎలాగైనా అతడి నుంచి డబ్బులు వసూలు చేయాలని క్రాంతి కుమార్‌ నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా కిడ్నాప్‌కు తెరదించాడు. అతడిని కిడ్నాప్‌ చేసి, బెదిరించి డబ్బులు రాబట్టుకోవాలని పథకం పన్నాడు. అందుకు తన స్నేహితుడైన కె సందీప్‌ (36) సహాయం కోరాడు.

ఇద్దరూ కలిపి జూన్‌ 8న రాత్రి నార్సింగి రోటరీ వద్ద తన వ్యాపార భాగస్వామితో కాలిసి కారులో వెళ్తున్న శేషు వర్ధన్‌రెడ్డి కిడ్నాప్‌ చేసేందుకు మాటు వేశారు. అప్పటికే కిడ్నాప్‌ చేసేందుకు కారులో దాగిఉన్న క్రాంతికుమార్‌, సందీప్‌ కలిసి కారులో వేచి ఉన్నారు. శేషు వర్ధన్‌రెడ్డి కారును అడ్డగించి, కారులోకి వెళ్లి పిడిగుద్దులు గుద్ది.. తమ కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 100 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, స్థానిక సీసీ కెమెరాల సహాయంతో వారు కర్నూలు వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మార్గంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌లను అప్రమత్తం చేసిన నార్సింగి పోలీసులు.. మహబూబ్‌నగర్‌ పరిధిలోని అడ్డాకుల టోల్‌ గేట్‌ వద్ద అడ్డాకుల పోలీసులు నిందితుల కారును నిర్భందించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రమణ గౌడ్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. ఏ రూట్ లో అంటే.?
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
తనను ఎత్తుకెళ్తున్న దొంగలను తానే పట్టించిన బైక్‌.. వీడియో వైరల్.
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
రవిబాబు డైరెక్షన్లో.. క్రేజీ సినిమా మిస్ చేసుకున్న రౌడీ హీరో..
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా! నెట్టింట ట్రెండింగ్‌ పిక్స్
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.! దర్శన్‌ కేసుపై సుదీప్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
'నా కూతురు కోసం పూర్తిగా మారిపోయా..' చరణ్ ఎమోషనల్ కామెంట్స్..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?
కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?