TGPSC Group 4 Selection List: తెలంగాణ ‘గ్రూప్‌-4’ సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ జాబితా విడుదల.. జూన్‌ 13 నుంచి వెబ్‌ఆప్షన్లు

తెలంగాణ గ్రూప్‌-4 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జాబితాను టీజీపీఎస్సీ ఆదివారం (జూన్‌ 9) విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచిన TGPSC తన ప్రకటనలో పేర్కొంది. వెబ్‌ ఆప్షన్లతోపాటు లోకల్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ క్యాటగిరీల వారీగా వివరాలు పొందుపరిచినట్టు తెలిపింది. షార్ట్‌ లిస్టైన అభ్యర్ధుల వివరాలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని..

TGPSC Group 4 Selection List: తెలంగాణ ‘గ్రూప్‌-4’ సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ జాబితా విడుదల.. జూన్‌ 13 నుంచి వెబ్‌ఆప్షన్లు
TGPSC Group 4
Follow us

|

Updated on: Jun 10, 2024 | 7:02 AM

హైదరాబాద్‌, జూన్‌ 10: తెలంగాణ గ్రూప్‌-4 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జాబితాను టీజీపీఎస్సీ ఆదివారం (జూన్‌ 9) విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచిన TGPSC తన ప్రకటనలో పేర్కొంది. వెబ్‌ ఆప్షన్లతోపాటు లోకల్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ క్యాటగిరీల వారీగా వివరాలు పొందుపరిచినట్టు తెలిపింది. షార్ట్‌ లిస్టైన అభ్యర్ధుల వివరాలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఎంపికైన అభ్యర్ధులు చెక్ లిస్ట్‌తోపాటు 2 కాపీలు అప్లికేషన్‌ ఫాం, అటెస్టేషన్‌ కాపీలు రెండేసి చొప్పున డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. వీటితోపాటు సంబంధిత అన్ని సర్టిఫికెట్లను తీసుకుని సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని టీజీపీఎస్సీ పేర్కొంది.

నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్టు కమిషన్‌ తెలిపింది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థులకు వెబ్‌ ఆప్షన్ల లింక్‌ జూన్‌ 13 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యే ముందు అభ్యర్ధులు తప్పనిసరిగా వెబ్‌ అప్షన్లు ఇచ్చుకోవాలని, వెబ్‌ అప్షన్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు అనుమతిస్తామని తన ప్రకటనలో కమిషన్‌ వివరించింది.

తెలంగాణ గ్రూప్‌-4 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్