Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Prelims 2024: కఠినంగా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష.. లక్ష మంది అభ్యర్ధులు డుమ్మా

తెలంగాణ గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం (జూన్‌ 9) ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా పకడ్భందీగా పరీక్ష నిర్వహించారు. 895 పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్‌ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించారు. అయితే గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షకు లక్షకుపైగా అభ్యర్థులు డుమ్మాకొట్టారు. మొత్తం 4.03లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా..

TGPSC Group 1 Prelims 2024: కఠినంగా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష.. లక్ష మంది అభ్యర్ధులు డుమ్మా
TSPSC Group 1 Prelims
Srilakshmi C
|

Updated on: Jun 10, 2024 | 6:37 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 10: తెలంగాణ గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం (జూన్‌ 9) ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా పకడ్భందీగా పరీక్ష నిర్వహించారు. 895 పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్‌ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించారు. అయితే గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షకు లక్షకుపైగా అభ్యర్థులు డుమ్మాకొట్టారు. మొత్తం 4.03లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 3.02లక్షల మంది మాత్రమే హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. అంటే కేవలం 74 శాతం మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్‌ 1 కింద 536 పోస్టులుండగా.. ఒక్కో పోస్టుకు 536 మంది చొప్పున పోటీపడనున్నారని ఆయన తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ కీని త్వరలోనే విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇక అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్‌ పరీక్షకు 28,150 మందిని ఎంపిక చేయనున్నట్లు కమిషన్‌ ఈ సందర్భంగా వెల్లడంచింది.

‘నిమిషం’ నిబంధనతో పలువురు పరీక్షకు దూరం

ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష అమలు చేయడంతో పలువురు అభ్యర్ధులు పరీక్షకు దూరమయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్‌ థెరిస్సా ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన పరీక్షకు నలుగురు అభ్యర్ధులు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. అలాగే కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన సాయిప్రియ పరీక్షకు హాజరయ్యేందుకు వస్తుండగా కూనారం రైలు గేటు పడడంతో ఐదు నిమిషాలు ఆలస్యమైంది. వీరిని అధికారులు అనుమతించకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో చేసేదేమీలేక వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోవైపు మంథనికి చెందిన ప్రసన్య పొరపాటున మరో మిత్రురాలి హాల్‌టికెట్‌ తీసుకురాగా, ఆమెను కూడా అధికారులు పరీక్షకేంద్రంలోకి అనుమతించలేదు.

కటాఫ్‌ ఎంత ఉంటుందంటే..

లాజికల్‌ రీజనింగ్‌, అనలెటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి. గణితం నేపథ్యమున్న వారు వీటికి సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. అలాగే సర్వేలు, నివేదికల నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఈసారి జనరల్‌ కటాఫ్‌ 75-80 మార్కుల మధ్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.