Kangana Ranaut: సద్గురు ఆశీర్వాదం తీసుకున్న కంగనా.. ఎంపీగా గెలిచిన తర్వాత ఇలా.. ఫోటోస్ వైరల్..
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేసి గెలిచింది. దీంతో కంగనాతోపాటు ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి దేవాలయాలకు వెళ్తూ పలు పూజలు చేస్తుంది కంగనా. అలాగే ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆలయాల్లో తన మొక్కులు తీర్చుకుంటుంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేసి గెలిచింది. దీంతో కంగనాతోపాటు ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు సంతోషంలో ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి దేవాలయాలకు వెళ్తూ పలు పూజలు చేస్తుంది కంగనా. అలాగే ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆలయాల్లో తన మొక్కులు తీర్చుకుంటుంది. తాజాగా సద్గురు ఆశీర్వాదాలు తీసుకుంది కంగనా.
ఎంపీగా గెలిచిన తర్వాత కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కు వెళ్లింది. అక్కడ ఆదియోగిని దర్శించి అనంతరం సద్గురు ఆశీస్సులు తీసుకుంది. ఆ తర్వాత ఇషా ఆశ్రమంలో కాసేపు గడిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో పింక్ కాటన్ చీరలో సంప్రదాయ లుక్‌లో కనిపిస్తుంది కంగనా. మరోవైపు ఎంపీగా గెలిచిన కంగానకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కంగనా సినిమాలు చేస్తాందా .. ? లేదా ..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో సినీ పరిశ్రమ నుంచి చాలా మంది ఎంపీలుగా పోటీ చేశారు. అందులో తన సొంత నియోజకవర్గం మండీ నుంచి ఆమె లోక్ సభకు ఎన్నికయ్యింది. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పైన భారీ మెజారిటీతో గెలిచింది. ఎంపీగా గెలిచిన తర్వాత చంఢీగడ్ విమానాశ్రయంలో కంగనాపై లేడీ కానిస్టేబుల్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.