- Telugu News Photo Gallery Cinema photos Bhagyashri borse shocks her fans with back to back movie offers
Bhagyashri Borse: తెలుగు ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్.. వరుస సినిమాలతో దూసుకుపోతుందిగా !!
గత ఐదేళ్లలో టాలీవుడ్‌కు దూసుకొచ్చిన హీరోయిన్లు ఎవరు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు కృతి శెట్టి, శ్రీలీల. వీళ్ళతో పాటు చాలా మంది ముద్దుగుమ్మలు పరిచయమైనా.. వీళ్ళ స్థాయిలో ప్రభావం చూపించలేదు. తాజాగా మరో బ్యూటీ ఇదే దూకుడు చూపిస్తున్నారు. తొలి సినిమా విడుదలకు ముందే.. మూడు సినిమాలు సైన్ చేసి సంచలనం రేపుతున్న ఆ భామ ఎవరో తెలుసా..? కరోనా టైమ్‌లో కరోనా కంటే వేగంగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన బ్యూటీ కృతి శెట్టి.
Updated on: Jun 12, 2024 | 12:20 PM

గత ఐదేళ్లలో టాలీవుడ్‌కు దూసుకొచ్చిన హీరోయిన్లు ఎవరు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు కృతి శెట్టి, శ్రీలీల. వీళ్ళతో పాటు చాలా మంది ముద్దుగుమ్మలు పరిచయమైనా.. వీళ్ళ స్థాయిలో ప్రభావం చూపించలేదు. తాజాగా మరో బ్యూటీ ఇదే దూకుడు చూపిస్తున్నారు. తొలి సినిమా విడుదలకు ముందే.. మూడు సినిమాలు సైన్ చేసి సంచలనం రేపుతున్న ఆ భామ ఎవరో తెలుసా..?

కరోనా టైమ్‌లో కరోనా కంటే వేగంగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన అనే ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలకు బాగానే గాయం చేసారు ఈ భామ. అదే ఊపులో రెండేళ్ల పాటు వరస సినిమాలతో రచ్చ రచ్చ చేసారు కృతి శెట్టి. ఈమె తర్వాత శ్రీలీల ఇదే స్థాయిలో దూకుడు చూపించారు. ఇప్పుడు ఈ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు.

కృతి శెట్టికి తెలుగు కంటే తమిళం, మలయాళం నుంచి ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాంతో అక్కడే ఫోకస్ చేస్తున్నారు ఈ బ్యూటీ. మరోవైపు శ్రీలీలకు తాజాగా రవితేజ సినిమాలో ఆఫర్ వచ్చింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నా అది ఎప్పుడు మొదలవుతుందో అనుమానమే. దాంతో ఈ ఇద్దరి స్థానాన్ని ఇప్పుడు భాగ్య శ్రీ బోర్సే భర్తీ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్‌తో ఈ బ్యూటీ పరిచయం అవుతున్నారు. మిస్టర్ బచ్చన్‌లో రవితేజతో జోడీ కడుతున్నారు భాగ్య శ్రీ.

రవితేజ మిస్టర్ బచ్చన్‌తో భాగ్యశ్రీ భోర్సే అనే హీరోయిన్ పరిచయం అవుతున్నారు. మొత్తానికి ఈ న్యూ బ్యూటీస్ అంతా అందాల దండయాత్రకు సిద్ధమవుతున్నారు.




