- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Priya Anand visits Tirumala Srivari Temple, Shares Photos
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో తరించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. రానా దగ్గుబాటి, రామ్ పోతినేని, శర్వానంద్, సిద్ధార్థ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.
Updated on: Jun 11, 2024 | 8:37 PM

ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. రానా దగ్గుబాటి, రామ్ పోతినేని, శర్వానంద్, సిద్ధార్థ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

అయితే ఉన్నట్లుండి టాలీవుడ్ కు దూరమైందీ అందాల తార. ఇప్పుడు కేవలం తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలకే పరిమితమైంది.

ఈ అందాల తార మరెవరో కాదు రానా దగ్గుబాటితో కలిసి లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియా ఆనంద్. తాజాగా ఈ ముద్దుగుమ్మ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది.

ఈ సందర్భంగా శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన ప్రియా ఆనంద్ తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ఆమె కూడా అడిగన వారందరికీ ఓపికగా ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చింది.

ప్రస్తుతం ప్రియా ఆనంద్ తిరుమల శ్రీవారి పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

తెలుగులో రామరామ కృష్ణకృష్ణ, 180, కో అంటే కోటి సినిమాల్లో నటించింది ప్రియా ఆనంద్. ఆ తర్వాత ఎక్కువగా కన్నడ, మలయాళ సినిమాలకే పరిమితమైంది.