- Telugu News Photo Gallery Cinema photos Suriya and vikram fans are serious about Kanguva Thangalaan release dates
ఆ సినిమాల విడుదలపై సీరియస్ అయిన అభిమానులు.. నిర్మాతలు ఏమంటున్నారంటే ??
మీరు చిల్ అవ్వండి.. మిగిలింది మేం చూసుకుంటాం అని అంటున్నారు సూర్య అండ్ విక్రమ్ సినిమాల మేకర్స్. ఇంతకీ ఏం జరిగింది? ఎవరిని చిల్ అవ్వమంటున్నారు? ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది... ఇలా చాలా ప్రశ్నలే మొదలవుతున్నాయి. వాటికి సమాధానాల గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి.. సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువ. ప్రపంచవ్యాప్తంగా 35కి పైగా భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.
Updated on: Jun 11, 2024 | 6:29 PM

ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ ట్రైలర్‌లో ప్రతి షాట్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఆటవిక సమూహాలకు సంబంధించిన కథ అని అర్థమవుతోంది. ఆద్యంతం సరికొత్తగా డిజైన్ చేశారు మేకర్స్.

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా కంగువ. శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దిశా పాట్ని హీరోయిన్. బాబీ డియోల్ కీ రోల్‌లో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది.

మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

నీ రక్తమూ నా రక్తమూ వేరువేరా? అని సూర్య చెప్పే డైలాగును బట్టి, ఇది దాయాదుల మధ్య పోరేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్ జనాల్లోకి ఇన్‌స్టంట్‌గా వెళ్లడానికి విజువల్స్ ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో, అంతకన్నా ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యూజ్ అవుతోంది.

నెవర్ బిఫోర్ అవతార్స్ లో విక్రమ్ అండ్ సూర్య దండయాత్రకు మేం సిద్ధం అంటున్నారు. ఈ కాన్సెప్ట్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయా.?




