Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Price: సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు.. మళ్లీ ఘాటెక్కిన ఉల్లి! కూరగాయలదీ అదే దారి..

కూరగాయలు కొనాలంటేనే సామాన్యుడు హడలెత్తిపోతున్నాడు. నిన్నమొన్నటి వరకు కాస్త పరవాలేదు అనుకున్న ఉల్లి ధర కూడా తాజాగా ఘాటెక్కింది. చూస్తుండగానే ధరలు పైపైకి చేరుతున్నాయి. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ.40 నుంచి రూ.45 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్‌ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని..

Onion Price: సామాన్యుడి నెత్తిపై మరో పిడుగు.. మళ్లీ ఘాటెక్కిన ఉల్లి! కూరగాయలదీ అదే దారి..
Onion
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 11, 2024 | 9:28 AM

కూరగాయలు కొనాలంటేనే సామాన్యుడు హడలెత్తిపోతున్నాడు. నిన్నమొన్నటి వరకు కాస్త పరవాలేదు అనుకున్న ఉల్లి ధర కూడా తాజాగా ఘాటెక్కింది. చూస్తుండగానే ధరలు పైపైకి చేరుతున్నాయి. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ.40 నుంచి రూ.45 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్‌ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌ దేశ వ్యాప్తంగా ఫేమస్‌. ఈ మార్కెట్కు షోలాపూర్, నాసిక్, పూణే, అహ్మద్‌నగర్‌ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్నుల వరకు ఉల్లి దిగుమతులు అవుతుంటాయి.

ఇక ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు మార్కెట్లకు సైతం ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే ఈ మార్కెట్‌కు ప్రస్తుతం రోజుకు 240 టన్నుల ఉల్లి మాత్రమే వస్తోంది. ఫలితంగా గత వారం రోజులుగా ఉల్లి ధరల్లో మార్పులు వచ్చాయి. వారం క్రితం రిటైల్‌ మార్కెట్‌లో కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు పలికిన కేజీ ఉల్లి.. ఇప్పుడు రూ.50 నుంచి రూ.60కి చేరాయి. వారం క్రితం నాసి రకం ఉల్లి రూ.100కు మూడు కిలోలు విక్రయిస్తుండగా.. ప్రస్తుతం దుకాణాల వద్ద నాణ్యతను కిలో రూ.40 నుంచి రూ.45 వరకు అమ్ముతున్నారు. పైగా త్వరలో బక్రీద్‌ పండగ ఉండటంతో డిమాండ్‌ అంతకంత పెరుగుతుంది. దీంతో ఉల్లి ధరలు కూడా పైపైకి చేరుతున్నాయి. డిమాండ్, సరఫరా మధ్య అంతరం ఏర్పడటం వల్ల ధరలు పెరిగాయని మార్కెట్ ట్రేడర్లు అంటున్నారు.

మరోవైపు కూరగాయల ధరలు సైతం రెట్టింపయ్యాయి. వేసవి ఎండల తీవ్రత కూరగాయల సాగుకు తీవ్ర నష్టం కలగజేశాయి. అధిక ఉష్ణోగ్రతలకు పూత మాడిపోయి దిగుబడులు పడిపోవడంతో, ధరలకు రెక్కలొచ్చాయి. రూ.20 ఉండే కిలో వంకాయలు రూ.40కి చేరగా, బెండకాయలు రూ.24 నుంచి రూ.40కి చేరాయి. బీరకాయలు రూ.30 నుంచి రూ.50కి పెరిగాయి. ఇక టమాటా కూడా కిలో ధర రూ.20 నుంచి రూ.50కి పెరిగింది. మరోవైపు పప్పు, ఉప్పు వంటి నిత్యవసర వస్తువుల ధరలు కూడా ఆకాశానికి ఎగబాకాయి. పెరిగిన ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.