AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గోల్డెన్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర. తులం ఎంతుందంటే..

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా ఓ రేంజ్‌లో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం లేదా తగ్గుముఖం పట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 80 వేలకు చేరి, రూ. లక్షకు చేరుకుంటుందని వార్తలు వచ్చిన..

Gold Price Today: గోల్డెన్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర. తులం ఎంతుందంటే..
Gold Price
Narender Vaitla
|

Updated on: Jun 11, 2024 | 6:25 AM

Share

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా ఓ రేంజ్‌లో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం లేదా తగ్గుముఖం పట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 80 వేలకు చేరి, రూ. లక్షకు చేరుకుంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా నమోదవుతోన్న ధరలు కొనుగోలు దారులకు కాస్త ఊరటనిస్తోంది. తాజాగా మంగళవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,840గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 71,810వద్ద కొనసాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660 వద్ద కొనసాఉగతోంది.

* చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 66,290కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,320గా ఉంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,660 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,690గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 71,660 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,690గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 71,660 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే వెండి మాత్రం దూసుకుపోతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో వెండి ధర ఏకంగా రూ. లక్షకు చేరువలో ఉంది. మంగళవారం ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 91,800 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా చెన్నైతో పాటు, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 96,300గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..