Canada: అయ్యో.. కెనడాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య! గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు

విదేశాల్లో చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇటీవల కాలంలో వరుసగా మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. వీరి మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌కు చెందిన పలువురు వ్యక్తులు ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కెనడాలో మరో సంఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన..

Canada: అయ్యో.. కెనడాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య! గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు
Punjab Man Shot Dead In Canada
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 11, 2024 | 11:09 AM

సర్రె, జూన్‌ 11: విదేశాల్లో చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇటీవల కాలంలో వరుసగా మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. వీరి మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌కు చెందిన పలువురు వ్యక్తులు ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కెనడాలో మరో సంఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 28 ఏళ్ల యువరాజ్‌ గోయల్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి శుక్రవారం కెనడాలోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారు.

విద్యార్థి వీసాపై 2019లో కెనడా వచ్చిన యువరాజ్ గోయల్.. ఇటీవలే కెనడియన్ పర్మనెంట్ రెసిడెంట్ (PR) హోదాను పొందాడు. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. యువరాజ్ గోయల్ తండ్రి రాజేష్ గోయల్ కట్టెల వ్యాపారి. అతని తల్లి శకున్ గోయల్ గృహిణి. పేదింటికి చెందిన యువరాజ్‌ కష్టపడి చదివి.. ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నాడు. ఉన్నట్లుండి కుమారుడి మరణవార్త తెలియడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన కట్టలు తెంచుకుంది. మరోవైపు యువరాజ్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని, అతని హత్యకు గల కారణాలు దర్యాప్తులో ఉన్నాయని రాయల్ కెనడియన్ పోలీసులు తెలిపారు .

బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని 164 స్ట్రీట్‌లోని 900-బ్లాక్‌లో కాల్పులు జరుగుతున్నట్లు సర్రే పోలీసులకు ఫోన్‌ కాల్ వచ్చింది. జూన్ 7 ఉదయం 8:46 గంటలకు ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు యువరాజ్‌పై కాల్పులు జరిపారు. పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే యువరాజ్‌ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుర్రే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులు మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. కాగా యువరాజ్‌ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!