నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు దావా వేసిన మహిళ

నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు దావా వేసిన మహిళ

Phani CH

|

Updated on: Jun 10, 2024 | 5:04 PM

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పై స్కాట్‌లాండ్‌కు చెందిన ఫియోనా హార్వే అనే మహిళ భారీ మొత్తంలో దావా వేయడం ఆసక్తిని కలిగిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న 'బేబీ రెయిన్ డీర్' వెబ్ సిరీస్ తన జీవిత కథ ఆధారంగానే తెరకెక్కించారని, హాస్యనటుడు రిచర్డ్ గాడ్ చెప్పిన ఆ కథను నిర్ధారించుకోకుండానే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గా మలిచిందని ఫియోనా హార్వే ఆరోపించారు. నిజ జీవిత గాథ అంటూ ప్రచారం చేసుకున్నారని, కానీ అందులో నిజానిజాలను నిర్ధారించుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పై స్కాట్‌లాండ్‌కు చెందిన ఫియోనా హార్వే అనే మహిళ భారీ మొత్తంలో దావా వేయడం ఆసక్తిని కలిగిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ‘బేబీ రెయిన్ డీర్’ వెబ్ సిరీస్ తన జీవిత కథ ఆధారంగానే తెరకెక్కించారని, హాస్యనటుడు రిచర్డ్ గాడ్ చెప్పిన ఆ కథను నిర్ధారించుకోకుండానే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గా మలిచిందని ఫియోనా హార్వే ఆరోపించారు. నిజ జీవిత గాథ అంటూ ప్రచారం చేసుకున్నారని, కానీ అందులో నిజానిజాలను నిర్ధారించుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా అందులో కొన్ని సీన్లు ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలో ఆమె నెట్ ఫ్లిక్స్ పై 1,419 కోట్ల రూపాయలకు కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. మార్తా స్కాట్ అనే మహిళ ద్వారా తాను ఎలా వేధింపులకు గురయ్యాడో కమెడియన్ రిచర్డ్ గాడ్ చెప్పిన అనుభవాల మేరకు ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ ‘బేబీ రెయిన్ డీర్’ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఇందులో తనను ఓ నేరస్తురాలిగా ముద్ర వేశారని, వేధింపుల కారణంగా జైలుకు వెళ్లినట్టు, కమెడియన్ రిచర్డ్ గాడ్ పై తాను లైంగిక దాడికి పాల్పడినట్టు చూపించారని ఫియోనా హార్వే ఆరోపించింది. ఈ వెబ్ సిరీస్ నిండా దారుణమైన అబద్ధాలు ఉన్నాయని తెలిపారు. నెట్ ఫ్లిక్స్ మాత్రం హార్వే ఆరోపణలకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది. తన జీవితంలో ఏం జరిగిందో చెప్పే హక్కు కమెడియన్ రిచర్డ్ గాడ్ కు ఉందని, అతడి జీవిత అనుభవాలనే తాము చూపించామని తేల్చి చెప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడాకుల కేసులో ఫొటోలు, వీడియోలు మాత్రమే సాక్ష్యం కావు.. ఢిల్లీ హైకోర్టు

తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే

ఆ వ్యాధి సోకిందంటే.. నిద్రలోనే షాపింగ్‌ చేసేస్తారు !! జాగ్రత్త