ఆ వ్యాధి సోకిందంటే.. నిద్రలోనే షాపింగ్‌ చేసేస్తారు !! జాగ్రత్త

షాపింగ్‌ చేయడమంటే నూటికి తొంబై శాతం మంది ఇష్టపడతారు. బడ్జెట్‌ను బట్టి ఉన్నదాంట్లోనే అత్యవసర వస్తువులు కొనుక్కుంటారు. ఇక డబ్బున్నవారికయితే ఏదిపడితే అది కొనేయడం అదో సరదా. ఇదంతా ఎందుకంటే.. ఓ రకమైన వ్యాధి సోకితే మాత్రం తమకు తెలియకుండానే నిద్రలోనే షాపింగ్‌ చేస్తారట. ఈలోపే క్రెడిట్‌ కార్డు లేదా డెబెట్‌ కార్డు నుంచి పేమెంట్‌ అయినట్టు ఫోన్‌కు మెసేజ్ రావడం కూడా జరిగిపోతుంది. మెలకువ వచ్చాక గానీ అసలు విషయం తెలియదట.

ఆ వ్యాధి సోకిందంటే.. నిద్రలోనే షాపింగ్‌ చేసేస్తారు !! జాగ్రత్త

|

Updated on: Jun 10, 2024 | 2:15 PM

షాపింగ్‌ చేయడమంటే నూటికి తొంబై శాతం మంది ఇష్టపడతారు. బడ్జెట్‌ను బట్టి ఉన్నదాంట్లోనే అత్యవసర వస్తువులు కొనుక్కుంటారు. ఇక డబ్బున్నవారికయితే ఏదిపడితే అది కొనేయడం అదో సరదా. ఇదంతా ఎందుకంటే.. ఓ రకమైన వ్యాధి సోకితే మాత్రం తమకు తెలియకుండానే నిద్రలోనే షాపింగ్‌ చేస్తారట. ఈలోపే క్రెడిట్‌ కార్డు లేదా డెబెట్‌ కార్డు నుంచి పేమెంట్‌ అయినట్టు ఫోన్‌కు మెసేజ్ రావడం కూడా జరిగిపోతుంది. మెలకువ వచ్చాక గానీ అసలు విషయం తెలియదట. నిద్రలోనే షాపింగ్‌ చేసే ఈ అరుదైన వ్యాధిని వైద్య పరిభాషలో పారాసోమ్నియా స్లీపింగ్‌ డిజార్డర్‌గా పిలుస్తారు. యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్‌ పారాసోమ్నియా వ్యాధితో బాధపడుతోంది. అరుదైన ఈ డిజార్డర్‌ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేస్తుందట. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు దగ్గర నుంచి ఫ్రిడ్జ్‌ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లులను కూడా క్రెడిట్‌ కార్డులతో చెల్లించేస్తుందట. మెలకువ వచ్చాక మొబైల్‌ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్‌లో డబ్బు కట్‌ అయ్యాక గానీ అసలు విషయం తెలుసుకోలేకతున్నానని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్‌ చేసి లక్షల్లో డబ్బుల పోగొట్టుకున్నానంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్‌ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు

హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌

Follow us