మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ప్రముఖ నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు పంపింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనుబంధ సంస్థ ఫెయిర్ ప్లే యాప్ కోసం ప్రమోషన్ చేయడానికి సంబంధించి ఈ నెల 29న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. గతేడాది ఐపీఎల్ ఎడిషన్ మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ చట్టవిరుద్ధంగా స్ట్రీమింగ్ చేసిందని.. దీనివల్ల తమకు కోట్లలో నష్టం వచ్చిందంటూ ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన వయాకామ్ ఆరోపించింది.

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

|

Updated on: Apr 26, 2024 | 9:38 PM

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ప్రముఖ నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు పంపింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనుబంధ సంస్థ ఫెయిర్ ప్లే యాప్ కోసం ప్రమోషన్ చేయడానికి సంబంధించి ఈ నెల 29న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. గతేడాది ఐపీఎల్ ఎడిషన్ మ్యాచ్ లను ఫెయిర్ ప్లే యాప్ చట్టవిరుద్ధంగా స్ట్రీమింగ్ చేసిందని.. దీనివల్ల తమకు కోట్లలో నష్టం వచ్చిందంటూ ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన వయాకామ్ ఆరోపించింది. దీంతో ఇందుకు సంబంధించి తమన్నాను సైబర్ సెల్ ప్రశ్నించనుంది. ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సైబర్ సెల్ ఇప్పటికే సమన్లు పంపింది. అయితే విదేశాల్లో ఉన్నందున సంజయ్ దత్ విచారణకు హాజరుకాలేదు. తన స్టేట్ మెంట్ నమోదు చేసేందుకు మరో తేదీ, సమయం పంపాలని సంజయ్ దత్ సైబర్ సెల్ ను కోరాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్‌ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు

హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !! వైరల్‌ అవుతున్న వీడియో

Follow us