బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్‌ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు

బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్‌ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు

Phani CH

|

Updated on: Apr 26, 2024 | 6:57 PM

సిలికాన్‌ వ్యాలీ గా పేరుగాంచిన దేశ ఐటీ రాజధాని బెంగ‌ళూర్‌లో ట్రాఫిక్‌ కష్టాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ నగరంలో ట్రాఫిక్‌ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెకీల ట్రాఫిక్ క‌ష్టాలు అంతాఇంతా కాదు. తాజాగా ఓ టెకీ రద్దీగా ఉన్న రోడ్డుపై స్కూటీమీద వెళ్తూ మొబైల్‌ ఫోన్‌లో జూమ్‌కాల్‌ వింటున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మహిళ ఆన్‌లైన్ మీటింగ్‌లో నిమగ్నమై ఉన్నట్లు వీడియోలో కనిపించింది.

సిలికాన్‌ వ్యాలీ గా పేరుగాంచిన దేశ ఐటీ రాజధాని బెంగ‌ళూర్‌లో ట్రాఫిక్‌ కష్టాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ నగరంలో ట్రాఫిక్‌ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెకీల ట్రాఫిక్ క‌ష్టాలు అంతాఇంతా కాదు. తాజాగా ఓ టెకీ రద్దీగా ఉన్న రోడ్డుపై స్కూటీమీద వెళ్తూ మొబైల్‌ ఫోన్‌లో జూమ్‌కాల్‌ వింటున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మహిళ ఆన్‌లైన్ మీటింగ్‌లో నిమగ్నమై ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఇది చూసిన స్థానికులు వెంటనే ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. వర్క్‌ ఫ్రం ట్రాఫిక్ .. బెంగళూరులో ఓ సాధారణ రోజు అంటూ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ‘బెంగళూరులోనే ఇలాంటివి సాధ్యం’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సిలికాన్‌ సిటీలో ట్రాఫిక్‌ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2 నుంచి 3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !! వైరల్‌ అవుతున్న వీడియో

నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు