విడాకుల కేసులో ఫొటోలు, వీడియోలు మాత్రమే సాక్ష్యం కావు.. ఢిల్లీ హైకోర్టు
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరిగిపోతోంది.. డీప్ ఫేక్ ఫొటోలే అసలైన ఫొటోలుగా చలామణి అవుతున్న రోజుల్లో ఫొటోలు, వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కేవలం ఫొటోలు, వీడియోలు ఇస్తే సరిపోదు.. అవి నిజమైనవేననే ఆధారాలను కూడా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఓ జంట విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరిగిపోతోంది.. డీప్ ఫేక్ ఫొటోలే అసలైన ఫొటోలుగా చలామణి అవుతున్న రోజుల్లో ఫొటోలు, వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కేవలం ఫొటోలు, వీడియోలు ఇస్తే సరిపోదు.. అవి నిజమైనవేననే ఆధారాలను కూడా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఓ జంట విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య, ఐదేళ్ల కూతురుకు కలిపి నెల నెలా 75 వేల రూపాయలు భరణం కింద చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. భర్త వేసిన పిటిషన్‌ను జస్టిస్ రాజీవ్ శక్‌దర్, జస్టిస్ అమిత్ బన్సల్‌ల ధర్మాసనం శనివారం తోసిపుచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ ఆర్కిటెక్ట్‌కు 2018లో వివాహమైంది. ఈ దంపతులకు అయిదేళ్ల పాప ఉంది. తన భార్యకు మరొకరితో సంబంధం ఉందంటూ.. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను చూపుతూ అక్కడి ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోసం భర్త దరఖాస్తు చేశాడు. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. అయితే, తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది కాబట్టి తాను ఎలాంటి మనోవర్తి చెల్లించాల్సిన అవసరంలేదని భర్త వాదించారు. భార్య వివాహేతర సంబంధానికి సాక్ష్యంగా ఫొటోలను కోర్టుకు సమర్పించాడు. ఈ కేసును జస్టిస్ రాజీవ్ షక్దర్, జస్టిస్ అమిత్ బన్సల్ ల ధర్మాసనం విచారించింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త సమర్పించిన ఫొటోలు స్పష్టంగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, డీప్ ఫేక్ ఫొటోల బెడద నేపథ్యంలో ఆ ఫొటోలను సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మరింత స్పష్టమైన ఫొటోలు, అవి నిజమైనవేననే ఆధారాలతో కోర్టుకు అందజేస్తే పరిశీలిస్తామని పేర్కొంది
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే
ఆ వ్యాధి సోకిందంటే.. నిద్రలోనే షాపింగ్ చేసేస్తారు !! జాగ్రత్త