Canada: కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య..

Canada: కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య..

Anil kumar poka

|

Updated on: Jun 11, 2024 | 1:11 PM

కెనడాలో భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సర్రీ నగరంలో అతడిపై నిందితులు కాల్పులు జరపడంతో కన్నుమూశాడు. జూన్ 7న సర్రీలోని 164 స్ట్రీట్‌లోని 900-బ్లాక్‌లో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే యువరాజ్ మృతి చెందాడు. పైచదువుల కోసం గోయల్ 2019లో కెనడా వెళ్లాడు.

కెనడాలో భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం సర్రీ నగరంలో అతడిపై నిందితులు కాల్పులు జరపడంతో కన్నుమూశాడు. జూన్ 7న సర్రీలోని 164 స్ట్రీట్‌లోని 900-బ్లాక్‌లో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే యువరాజ్ మృతి చెందాడు. పైచదువుల కోసం గోయల్ 2019లో కెనడా వెళ్లాడు. ఇటీవలే అతడికి శాశ్వత నివాసార్హత అనుమతి వచ్చింది. యువరాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. యువరాజ్‌కు ఎటువంటి నేర చరిత్ర లేదు. అతడి హత్యకు గల కారణం కూడా ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో పోలీసులు సర్రీకి చెందిన మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై శనివారం హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. నిందితులు కావాలనే యువరాజ్‌ను టార్గెట్ చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే, హత్యకు కారణమేంటనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.