60 ఏళ్లనాటి తొలి “ఎర్త్‌” తీసిన ఆస్ట్రోనాట్‌ తాజాగా మృతి

అమెరికాలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో విషాదం చోటు చేసుకుంది. నాసా రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్ విమాన ప్రమాదంలో మరణించారు. 1968లో అపోలో 8లో నాసా ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపించింది. అయితే ఈ ముగ్గురు వ్యామగాములు డిసెంబర్‌ 24న చంద్ర కక్ష్యలోకి వెళ్లి తిరిగి డిసెంబర్‌ 27న భూమికి తిరిగి వచ్చారు. అప్పుడే భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.

60 ఏళ్లనాటి తొలి ఎర్త్‌ తీసిన ఆస్ట్రోనాట్‌ తాజాగా మృతి

|

Updated on: Jun 11, 2024 | 4:15 PM

అమెరికాలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో విషాదం చోటు చేసుకుంది. నాసా రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్ విమాన ప్రమాదంలో మరణించారు. 1968లో అపోలో 8లో నాసా ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపించింది. అయితే ఈ ముగ్గురు వ్యామగాములు డిసెంబర్‌ 24న చంద్ర కక్ష్యలోకి వెళ్లి తిరిగి డిసెంబర్‌ 27న భూమికి తిరిగి వచ్చారు. అప్పుడే భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. అపోలోలో చంద్రుడి చుట్టు తిరిగే సమయంలో ముగ్గురి ఆస్ట్రోనాట్స్‌లో ఒకరైన విలియం ఆండర్స్ చంద్రుడి ఉపరితలంపై నుంచి .. తొలిసారి వెలుగులు విరజిమ్ముతున్న భూమి ఫోటో తీశారు. ఈ ఫోటోకు ‘ఎర్త్ రైజ్’గా పేరు పెట్టారు. అంతరిక్షం నుంచి తీసిన తొలి కలర్ ఫోటో ఇది. తాజాగా వాషింగ్టన్‌లో అండర్స్‌ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. విమానం ప్రమాదంలో అండర్స్‌ మరణించారని, ఆ విమానంలో తన తండ్రి మాత్రమే ఉన్నారంటూ అండర్స్‌ కుమారుడు గ్రెగ్‌ చెప్పినట్లు ది సీటెల్ టైమ్స్ నివేదించింది. కేసీపీక్యూ-టీవీ కథనం ప్రకారం..అండర్స్ పాతకాలపు ఎయిర్ ఫోర్స్ సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆకాశం నుంచి నిటారుగా సముద్ర తీర ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 90 ఏళ్ల అండర్స్‌ ప్రాణాలు కోల్పోవడంతో నాసాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. కింగ్‌ ఫిషర్‌ వచ్చేసింది

ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి… భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంపై బ్యానర్ తో ఎగిరిన విమానం

Follow us