ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి... భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంపై బ్యానర్ తో ఎగిరిన విమానం

ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి… భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంపై బ్యానర్ తో ఎగిరిన విమానం

Phani CH

|

Updated on: Jun 11, 2024 | 2:43 PM

ఆదివారం న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ అద్భుత విజయాన్ని సాధించింది. అయితే స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో ఓ విమానం స్టేడియంపై నుంచి ఎగురుకుంటూ వెళ్లింది. ఆ విమానం ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి అని రాసి ఉంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

ఆదివారం న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ అద్భుత విజయాన్ని సాధించింది. అయితే స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో ఓ విమానం స్టేడియంపై నుంచి ఎగురుకుంటూ వెళ్లింది. ఆ విమానం ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి అని రాసి ఉంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. భారత్-పాక్ మ్యాచ్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది కాబట్టి, ఇలాంటి వేళ ఇమ్రాన్ ఖాన్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలన్నది ఆ స్లోగన్ సృష్టికర్తల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 50 పరుగులు చేసింది. మ్యాచ్‌ చేజారిపోతుందా అనుకున్న సమయంలో ఆపద్బాంధవుడిలా తన బౌలింగ్‌తో మాయ చేశాడు బుమ్రా. కీలకమైన బ్యాటర్లను ఔట్ చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత కెప్టెన్ బాబర్‌ను.. ఆ తర్వాత డేంజరస్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌ను ఔట్ చేశాడు. ఇక లోయర్‌ ఆర్డర్‌లో చెలరేగే ఇఫ్తికార్ అహ్మద్‌ను కూడా పెవిలియన్‌కు పంపి టీమ్‌ఇండియా విజయాన్ని ఖరారు చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాన నీటిలో సరదాగా పరుపుపై తేలిన ఓ వ్యక్తి.. వీడియో వైరల్

“లైగర్‌” అమ్మాయి.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా పూజా తోమర్ రికార్డ్

ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. తప్పిన ఘోర ప్రమాదం

సముద్రంలో పడిపోయిన ఐఫోన్ ను ఏడు గంటలు కష్టపడి వెదికి తెచ్చిన టీమ్

కంగన చెంపపై కొట్టిన కానిస్టేబుల్ కు బంగారు ఉంగరం.. ఎవరిస్తున్నారంటే ??