“లైగర్‌” అమ్మాయి.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా పూజా తోమర్ రికార్డ్

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన " లైగర్‌' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఆట ఒకటుందని చాలా మందికి తెలిసింది. రీల్‌ లైఫ్‌ పక్కన పెడితే రియల్‌ లైఫ్‌లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్‌ లో మన అమ్మాయి తొలిసారి విదేశీ గడ్డపై భారత జెండాను రెపరెపలాడించింది. అమెరికాలో పూజా తోమర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (UFC)లో బౌట్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా పూజా తోమర్ రికార్డులకెక్కింది.

లైగర్‌ అమ్మాయి.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా పూజా తోమర్ రికార్డ్

|

Updated on: Jun 10, 2024 | 5:15 PM

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ” లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అనే ఆట ఒకటుందని చాలా మందికి తెలిసింది. రీల్‌ లైఫ్‌ పక్కన పెడితే రియల్‌ లైఫ్‌లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్‌ లో మన అమ్మాయి తొలిసారి విదేశీ గడ్డపై భారత జెండాను రెపరెపలాడించింది. అమెరికాలో పూజా తోమర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (UFC)లో బౌట్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా పూజా తోమర్ రికార్డులకెక్కింది. లూయిస్‌విల్లే వేదిక‌గా శ‌నివారం జ‌రిగిన గేమ్‌లో బ్రెజిల్‌ ఫైట‌ర్‌ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను ఓడించి పూజా విజేతగా నిలిచింది. తొలి రౌండ్‌లో ప్రత్యర్ధిపై పూజా.. పైచేయి సాధించగా.. రెండో రౌండ్‌లో మాత్రం అమండా డోస్ శాంటోస్ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో రౌండ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఫైనల్ బెల్ మోగే సమయానికి పూజా వరుస కిక్‌లతో అమండా డోస్ శాంటోస్‌ను వెనక్కి నెట్టింది. దీంతో మూడో రౌండ్‌ను 29-28తో సొంతం చేసుకున్న పూజా.. యూఎఫ్‌సీ ఛాంపియన్‌గా నిలిచింది. 28 ఏళ్ల పూజా ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని బుధానా గ్రామంలో జ‌న్మించింది. పూజా చైనీస్ యుద్ధ కళ వుషుతో తన పోరాట క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించింది. వుషు గేమ్‌లో పూజ జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2012 లో సూపర్ ఫైట్ లీగ్‌తో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంట్రీ ఇచ్చింది

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. తప్పిన ఘోర ప్రమాదం

సముద్రంలో పడిపోయిన ఐఫోన్ ను ఏడు గంటలు కష్టపడి వెదికి తెచ్చిన టీమ్

కంగన చెంపపై కొట్టిన కానిస్టేబుల్ కు బంగారు ఉంగరం.. ఎవరిస్తున్నారంటే ??

నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు దావా వేసిన మహిళ

విడాకుల కేసులో ఫొటోలు, వీడియోలు మాత్రమే సాక్ష్యం కావు.. ఢిల్లీ హైకోర్టు

Follow us
Latest Articles
హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని
హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని
చిన్నారులకు ఈ స్నాక్స్‌ చేసి ఇవ్వండి.. ఎంతో ఇష్టంగా తింటారు..
చిన్నారులకు ఈ స్నాక్స్‌ చేసి ఇవ్వండి.. ఎంతో ఇష్టంగా తింటారు..
అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న వయ్యారి..
అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న వయ్యారి..
45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
45పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా?
'పవన్ బాబాయి కాదు.. పెద్దన్న.. గెలవాలని ప్రేయర్స్ చేశాను'
'పవన్ బాబాయి కాదు.. పెద్దన్న.. గెలవాలని ప్రేయర్స్ చేశాను'
భద్రత విషయంలో తగ్గేదేలే.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు ఫస్ట్‌ ప్లేస్‌
భద్రత విషయంలో తగ్గేదేలే.. క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు ఫస్ట్‌ ప్లేస్‌
అవికా గోర్‏కు చేదు అనుభవం.. ధైర్యం లేదంటూ..
అవికా గోర్‏కు చేదు అనుభవం.. ధైర్యం లేదంటూ..
TGPSC గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌
TGPSC గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌
కరేబీయన్‌లో ఇరగదీసిన ముగ్గురు టీమిండియా క్రికెటర్లు..
కరేబీయన్‌లో ఇరగదీసిన ముగ్గురు టీమిండియా క్రికెటర్లు..
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. ఎప్పటి నుంచో తెలుసా?
మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. ఎప్పటి నుంచో తెలుసా?