AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్ ఇంట పెళ్లి సందడి.. మోదీ, ముర్ములకు ఆహ్వానం

సచిన్ ఇంట పెళ్లి సందడి.. మోదీ, ముర్ములకు ఆహ్వానం

Phani CH
|

Updated on: Feb 12, 2026 | 7:19 PM

Share

సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, తన చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ముంబైలో ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. సచిన్ స్వయంగా రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. సానియా చందోక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్, వెటర్నరీ టెక్నీషియన్. ఈ వివాహానికి క్రీడా, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు.

క్రికెట్ గాడ్‌, భారతరత్న సచిన్ టెండూల్కర్ నివాసంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, తన చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. మార్చి 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ముంబై వేదికగా ఈ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుక కోసం సచిన్ స్వయంగా రంగంలోకి దిగారు. తన భార్య అంజలి, కుమార్తె సారా, కాబోయే దంపతులు అర్జున్, సానియాలతో కలిసి ఢిల్లీలో పలువురు రాజకీయ దిగ్గజాలను కలిశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను కలిసి వివాహ ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సచిన్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, పెద్దల ఆశీస్సులు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అర్జున్ టెండూల్కర్ మనసు గెలుచుకున్న సానియా చందోక్ ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె, వెటర్నరీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా స్వంతంగా పెట్ స్పా వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు కావడం విశేషం. క్రీడా, రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానుండటంతో, మార్చి మొదటి వారంలో ముంబైలో సందడి నెలకొననుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘వందేమాతరం’పై కేంద్రం కీలక నిర్ణయం

ఫిబ్రవరి 17న అగ్ని వలయ సూర్యగ్రహణం.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసే అవకాశం

5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..

భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా