AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'వందేమాతరం'పై కేంద్రం కీలక నిర్ణయం

‘వందేమాతరం’పై కేంద్రం కీలక నిర్ణయం

Phani CH
|

Updated on: Feb 12, 2026 | 7:17 PM

Share

కేంద్ర హోంశాఖ వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో వందేమాతరం పాడేటప్పుడు తప్పనిసరిగా నిలబడాలి. 2025-2026లో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతాయి. దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటడమే దీని లక్ష్యం.

భారత స్వాతంత్ర్య పోరాటంలో అగ్నిజ్వాలలు రగిల్చిన జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవార్థం కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, జాతీయ గీతం (జనగణమన)తో సమానంగా దీనికి గౌరవాన్ని కల్పిస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, పాఠశాలలు, అవార్డు వేడుకల్లో వందేమాతరం పాడేటప్పుడు అందరూ తప్పనిసరిగా లేచి నిలబడి గౌరవం చాటాలి. జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగాల సమయంలో 3 నిమిషాల 10 సెకన్ల పూర్తి గేయాన్ని పాడాల్సి ఉంటుంది. ఒకే కార్యక్రమంలో జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ ఉంటే.. మొదట వందేమాతరం పాడాలి. అయితే సినిమాలు, వార్తల మధ్యలో ఈ గేయం వస్తే నిలబడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న రచించిన ఈ గేయం, 2025 నాటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆయన రాసిన ‘ఆనందమఠ్’ నవల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ పాట, కోట్లాది మందిలో దేశభక్తిని నింపింది. 1950 జనవరి 24న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందేమాతరానికి జాతీయ గీతంతో సమాన హోదాను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని 2025 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. జాతీయ సమైక్యతను, మాతృభూమి పట్ల భక్తిని చాటిచెప్పడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫిబ్రవరి 17న అగ్ని వలయ సూర్యగ్రహణం.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసే అవకాశం

5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..

భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా

ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే