AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే

ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే

Phani CH
|

Updated on: Feb 12, 2026 | 5:12 PM

Share

టాలీవుడ్‌లో తీవ్ర పోటీ మధ్య, సీనియర్ నటీమణులు పూజా హెగ్డే, కీర్తి సురేష్ తిరిగి అవకాశాలు అందుకుంటున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత పూజా హెగ్డే తెలుగులో అనిల్ రావిపూడి సినిమాతో రీఎంట్రీ ఇస్తుండగా, కీర్తి సురేష్ 'రౌడీ జనార్ధన'తో పాటు వెంకీ చిత్రంలోనూ కనిపించనున్నారు. ఈ ఇద్దరి పునరాగమనం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడున్న పోటీకి ఏ హీరోయిన్ అయినా ఆర్నెళ్లు స్క్రీన్ మీద కనిపించకపోతేనే అంతే సంగతులు.. అలాంటి రెండేళ్లు అడ్రస్ మిస్ అయితే ఇక వాళ్లను మరిచిపోవాల్సిందే. అలా ఉంది పోటీ మరి. ఇలాంటి పోటీని తట్టుకుని నిలబడుతూ.. మళ్లీ అవకాశాలు అందుకుంటున్నారు ఇద్దరు సీనియర్లు. మరి వాళ్లెవరు.. చేస్తున్న ఆ సినిమాలేంటి..? తెలుగులో పూజా హెగ్డే చివరగా కనిపించిన పాట ఇదే.. ఇదొచ్చి మూడేళ్లు దాటిపోయింది. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. 2022 తర్వాత టాలీవుడ్‌కు పూర్తిగా దూరమయ్యారు పూజా. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమాలో నటిస్తున్నారు పూజా. తమిళం, హిందీతో సరిపెట్టుకుంటున్న పూజాకు మరోసారి అనిల్ రావిపూడి పిలిచి ఆఫర్ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి, వెంకీ సినిమాలో పూజా హెగ్డేను ఓ హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సినిమాలో కీర్తి సురేష్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రౌడీ జనార్ధనతో రీ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తి. విజయ్ దేవరకొండతో పాటే ఇప్పుడు వెంకీతో ఛాన్స్ వస్తే అమ్మడి పంట పండినట్లే. వెంకీ, అనిల్ సినిమా ఓకే అయితే.. డిసెంబర్‌లో రౌడీ జనార్ధన, జనవరిలో వెంకీ సినిమాతో కీర్తి సురేష్ పలకరించనున్నారు. అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్‌తో పాటు ఫహాద్ ఫాజిల్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ హీరోకు జోడీగా ఆషికా రంగనాథ్ పేరు బలంగా వినిపిస్తుంది. హిట్లు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేస్తున్నారీమే. మొత్తానికి సీనియర్లు మళ్లీ బిజీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..

ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?

A. R. Rahman: 30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్

Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా

గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా ?? లేదా ??