AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా ?? లేదా ??

గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా ?? లేదా ??

Phani CH
|

Updated on: Feb 12, 2026 | 4:45 PM

Share

చిరంజీవి 'విశ్వంభర' సినిమా గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యమై, అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఇప్పుడు VFX పనులు దాదాపు పూర్తవడంతో మెగాస్టార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. త్రిష, మౌనీ రాయ్ నటిస్తున్న ఈ రూ.200 కోట్ల భారీ చిత్రం జూలై 10న విడుదల కానుంది. ఫైనల్ కాపీ సిద్ధంగా ఉంది, లేటెస్ట్ గా రాబోతున్న మెగాస్టార్ బ్లాక్‌బస్టర్‌ కోసం ఎదురుచూపులు.

నో మోర్ ఆర్గిమెంట్స్.. ఒకటే క్వశ్చన్.. విశ్వంభర రిలీజ్ ఎప్పుడు..? ఈ సమ్మర్‌లో అయినా వస్తుందా లేదా..? దర్శక నిర్మాతలను అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఇదే. ఒకవేళ సమ్మర్‌లో విడుదల చేసే ఉద్దేశ్యం ఉంటే ప్రమోషన్స్ ఎక్కడ..? విఎఫ్ఎక్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా..? ఉంటే ఎంతుంది..? సీజీ షాట్స్ పరిస్థితేంటి..? చూద్దామా క్లారిటీగా..? కొందరు హీరోల కెరీర్‌లో కొన్ని సినిమాలు తెలియకుండానే ఆలస్యమవుతూ ఉంటాయి. విశ్వంభరతో చిరంజీవికి ఇదే జరుగుతుందిప్పుడు. షూటింగ్ పూర్తై.. చాలా రోజులవుతున్నా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. ప్రమోషన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అప్పట్లో ఓ టీజర్.. ఆ తర్వాత ఓ పాట వచ్చాయంతే. ఆ తర్వాత శంకరవరప్రసాద్ వైపు వెళ్లిపోయారు చిరు. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ కావడంతో.. భారీ అంచనాల మధ్య మొదలైంది విశ్వంభర. షూటింగ్ కూడా త్వరగానే పూర్తి చేసారు వశిష్ట. 2025 సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా.. గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యమైంది. అందుకే ఈ గ్యాప్‌లో మన శంకరవరప్రసాద్ గారుతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు చిరు. విశ్వంభరను వదిలేసారంటూ మెగా ఫ్యాన్స్ సైతం నిట్టూరుస్తున్న వేళ.. మెగా అప్‌డేట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఓ పాటో మెరుస్తున్నారు. అలాగే VFX వర్క్స్ కూడా దాదాపు పూర్తయ్యాయి.. ఇవి చూసుకున్నాక చిరంజీవి కూడా సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు. బాబీ సినిమా మొదలవ్వడానికి ఇంకా నెల రోజులకు పైనే టైమ్ ఉంది… ఈలోపు విశ్వంభర ఔట్ పుట్‌పై మరింత కాన్సట్రేట్ చేసారు మెగాస్టార్. జూలై 10న విశ్వంభర విడుదల కానుంది. ఇప్పటికే ఫైనల్ కాపీ రెడీ అయిందని తెలుస్తుంది. యువీ క్రియేషన్స్ దాదాపు 200 కోట్లతో విశ్వంభరను నిర్మిస్తున్నారు. మొత్తానికి కాస్త లేటైనా.. లేటెస్ట్‌గా వస్తానంటున్నారు మెగాస్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే

ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ. 1.50 లక్షల టోకరా.. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్

దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు

Srisailam: శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం.. అంతా మల్లన్న మాయ అంటూ

Sapota: బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి