అకస్మాత్తుగా లేచి కూర్చున్న శవం.. అవాక్కైన స్థానికులు, పోలీసులు
శవం లేచింది.. అవును మీరు వింటున్నది నిజమే.. చెరువులో శవముందని సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ శవాన్ని పోస్టుమార్టానికి తరలించడం కోసం అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. వరంగల్ శివారులో ఈ విచిత్ర సంఘటన జరిగింది. చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని పోలీసులకు, 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, 108 సిబ్బంది చెరువు నుండి లేచిన శివాన్ని చూసి బిత్తర పోయారు.
శవం లేచింది.. అవును మీరు వింటున్నది నిజమే.. చెరువులో శవముందని సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ శవాన్ని పోస్టుమార్టానికి తరలించడం కోసం అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. వరంగల్ శివారులో ఈ విచిత్ర సంఘటన జరిగింది. చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని పోలీసులకు, 108 సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, 108 సిబ్బంది చెరువు నుండి లేచిన శివాన్ని చూసి బిత్తర పోయారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ కోవెల కుంట చిన్న చెరువులో సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక శవం తేలియాడుతూ కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, 108 సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పోలీసు కానిస్టేబుల్ జాగ్రత్తగా శవం చేయి పట్టుకొని ఒడ్డుకు లాగే ప్రయత్నం చేశాడు.. అంతే ఒక్కసారిగా శవంలో కదలికలు కనిపించాయి. హాయిగా నీటిలో సేద తీరుతుంటే.. నన్నెవడురా డిస్టర్బ్ చేసింది అన్నట్టు వెనక్కి తిరిగి కోపంగా చూశాడు. కానీ వెనకాల పోలీస్ కానిస్టేబుల్ కనబడడంతో శవాసనం వేసిన సారూ సల్లబడ్డాడు. గంటల కొద్దీ నీళ్ళల్లో నీ వేషాలు ఏంటని పోలీసులు ప్రశ్నించడంతో వారికి గడుసుగా సమాధానం చెప్పాడు. లేచిన శవం ఏం సమాధానం చెప్పిందో తెలుసా..పక్కనే ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నా.. ఎండ తీవ్రత ఉక్కపోత తట్టుకోలేక సల్లదనానికి ఈ చెరువులో పండుకున్న సార్ అని చెప్పడంతో పోలీసులు, 108 సిబ్బంది బిత్తరపోయారు. చల్లదనం కోసం శవాసనం వేసిన ఈ వ్యక్తిని చూసి అవాక్కవడం పోలీసుల వంతయింది. ఒక్క యాభై రూపాయలు ఇస్తే .. కాజీపేటకు పోతా సర్ అని పోలీసులనే డబ్బుల అడగడం ఈ ట్విస్ట్ లో మరో కొసమెరుపు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్8లోకి బ్యూటిఫుల్ పాపలు.. ఈ సారి ఇక రచ్చో రచ్చ
ఆ సర్జరీ చేయించుకోమని.. నన్ను మానసికంగా వేధించేవారు
‘మాజీ ప్రియురాలికి హృతిక్ మద్దతు’.. ఎక్కడో తేడా కొడుతుంది బుజ్జీ
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

