AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సును ఆపి.. శివమెత్తిన మహిళా ప్రయాణికురాలు.. ఏం చేసిందో తెలుసా..?

ఆర్టీసీ బస్సును ఎక్కే వరకు ఆపకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో ద్వారా వెంబడించి బస్సుకు అడ్డం తిరిగి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చాగంటి మంజుల తన ముగ్గురు పిల్లలతో కలసి జగిత్యాల జిల్లా కొండగట్టులో ఉంటున్నారు. బుధవారం పిల్లలతో కలిసి వరంగల్ వచ్చారు. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ వెళ్ళడానికి తన ముగ్గురు పిల్లలతో కలిసి వేచి చూస్తున్నారు.

Watch Video: నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సును ఆపి.. శివమెత్తిన మహిళా ప్రయాణికురాలు.. ఏం చేసిందో తెలుసా..?
Warangal
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 13, 2024 | 9:15 AM

Share

ఆర్టీసీ బస్సును ఎక్కే వరకు ఆపకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో ద్వారా వెంబడించి బస్సుకు అడ్డం తిరిగి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చాగంటి మంజుల తన ముగ్గురు పిల్లలతో కలసి జగిత్యాల జిల్లా కొండగట్టులో ఉంటున్నారు. బుధవారం పిల్లలతో కలిసి వరంగల్ వచ్చారు. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ వెళ్ళడానికి తన ముగ్గురు పిల్లలతో కలిసి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో నెక్కొండ- మహబూబాబాద్‎ వెళ్లే ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆ బస్సులో తన ఇద్దరు కూతుళ్లు, సామగ్రితో సహా ఎక్కించారు. దివ్యాంగుడైన తన కుమారుడిని లోపలికి ఎక్కించడానికి బస్సు కండక్టర్ నిరాకరించాడు. అప్పటికే బస్సు నిండిపోయి.. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి రావడంతో దివ్యాంగుడైన తన కుమారుడిని ఎక్కించడానికి ‘బస్సులో ఖాళీ లేదు.. మరో బస్సులో రావాలని’ కండక్టర్ సూచించారు.

అప్పటికే తన ఇద్దరు కుమార్తెలు బస్సులో ఉన్నారన్న విషయం తెలియని డ్రైవర్.. కండక్టర్ సూచన మేరకు ముందుకు పోనిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు కొంతదూరం బస్సు వెనకాల పరుగెత్తారు. చివరకు ఓ ఆటో తీసుకొని వెళ్లి శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద బస్సును అడ్డగించారు. నడి రోడ్డుపై శివమెత్తిన మహిళ తన ప్రతాపం చూపించారు. బస్సు ఎందుకు ఆపలేదని బస్సుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. తన ఇద్దరు పిల్లలు బస్సులో ఉండగా, దివ్యాంగుడైన కుమారుడిని ఎక్కించుకోకుండా ఎలా వెళతారని బస్సు డ్రైవర్, కండక్టర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు అరగంటకుపైగా బస్సు ముందుకు కదలకుండా అడ్డుకోవడంతో.. ప్రయాణికులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మీ కుమారుడిని ఆటోలో నుంచి తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తే కలిసి వెళ్లామని చెప్పినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆటో ఛార్జీలు ఎవరిస్తారని ప్రశ్నించి పట్ట పగలే చుక్కలు చూపించింది. బస్సును తిరిగి బస్టాండ్‎కు తీసుకెళ్లి.. తన కుమారుడిని ఎక్కించుకొని రావాలని పట్టుబట్టింది. ఈలోగా ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళా ప్రయాణికురాలిని పక్కకు తీసుకెళ్లి శాంతింపజేశారు. బస్టాండ్‎లో ఉన్న దివ్యంగుడిని ఎక్కించి ఆగిన బస్సును పంపించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!